Supreme Court: సుప్రీంకోర్టులో మరో 4 ప్రత్యేక ధర్మాసనాలు
Sakshi Education
సుప్రీంకోర్టులో మరో నాలుగు ప్రత్యేక ధర్మాసనాలు ఏర్పాటు చేస్తున్నట్లు సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నవంబర్ 23న తెలిపారు.
క్రిమినల్ కేసులు, ప్రత్యక్ష–పరోక్ష పన్నులు, భూసేకరణ, వాహన ప్రమాదాల క్లెయిమ్‌లకు సంబంధించిన కేసులను విడివిడిగా విచారించేందుకు ఈ నాలుగు సుప్రీం బెంచ్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు జస్టిస్ చంద్రచూడ్ పేర్కొన్నారు. ఈ కొత్త బెంచ్‌లు వచ్చే వారం నుంచి తమ పనులు మొదలుపెట్టనున్నాయి. సుప్రీంకోర్టులో ఓ కేసుకు సంబంధించి న్యాయవాది అత్యవసర విచారణ కోరిన సమయంలో సీజేఐ పై విధంగా స్పందించారు. జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని బెంచ్ భూసేకరణకు సంబంధించిన కేసులను విచారించనుందని సీజేఐ సూత్రప్రాయంగా తెలిపారు. ప్రత్యక్ష, పరోక్ష పన్నుల అంశాలు పరిష్కరించే బెంచ్ బుధ, గురువారాల్లో ఉంటుందని వెల్లడించారు.
చదవండి: అసెంబ్లీ... తెలుసుకోతగ్గ అంశాలు
Published date : 24 Nov 2022 12:31PM