Skip to main content

ఎస్‌ఎస్‌సీ జేఈలో విజేతగా నిలవాలంటే...

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ).. తాజాగా సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్; క్వాంటిటీ సర్వేయింగ్, కాంట్రాక్ట్ విభాగాల్లో జూనియర్ ఇంజనీర్ (గ్రూప్-బి) ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. దీనిద్వారా సెంట్రల్ వాటర్ కమిషన్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్ట్, సెంట్రల్ వాటర్ పవర్ రీసెర్చ్ స్టేషన్, నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ తదితర కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఖాళీలను భర్తీ చేస్తారు. ఇంజనీరింగ్ డిగ్రీ/డిప్లొమా అర్హతతో సుస్థిర కెరీర్‌కు బాటలు వేసుకునేందుకు వీలుకల్పించే ‘ఎస్‌ఎస్‌సీ జేఈ’ పరీక్షలో విజయానికి సూచనలు...
పరీక్ష విధానం...
జేఈ నియామక పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్-1 ఆబ్జెక్టివ్ విధానంలో, పేపర్-2 కన్వెన్షనల్ విధానంలో ఉంటుంది. పేపర్-1లో సాధించిన మార్కుల మెరిట్ జాబితా ప్రకారం పేపర్-2కు అర్హులను ఎంపిక చేస్తారు.

పేపర్ 1 (కంప్యూటర్ బేస్డ్: రెండు గంటలు):

సబ్జెక్టు

ప్రశ్నలు

మార్కులు

1. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్

50

50

2. జనరల్ అవేర్‌నెస్

50

50

3. జనరల్ ఇంజనీరింగ్ (సివిల్, స్ట్రక్చరల్/ఎలక్ట్రికల్/మెకానికల్)

100

100

మొత్తం

200

200


పేపర్- 2 (రిటెన్-2 గంటలు) :
జనరల్ ఇంజనీరింగ్ (సివిల్, స్ట్రక్చరల్/ఎలక్ట్రికల్/మెకానికల్)కు 300 మార్కులు కేటాయించారు.

సన్నద్ధత...
ఎస్‌ఎస్‌సీ (జేఈ) పరీక్ష పేపర్-1లో టెక్నికల్, నాన్ టెక్నికల్ అంశాలు ఉంటాయి కాబట్టి రెండు విభాగాలకు ప్రిపరేషన్‌లో సమ ప్రాధాన్యమివ్వాలి. ఈ పరీక్షకు తీవ్ర పోటీ ఉన్నందువల్ల తేలిగ్గా తీసుకోకుండా, పటిష్ట ప్రణాళికతో ప్రిపరేషన్ కొనసాగించాలి. రోజువారీ ప్రిపరేషన్ ప్రణాళికను అనుసరించడం మంచిది. అభ్యర్థులు తొలుత బేసిక్స్‌పై పట్టు సాధించేందుకు ప్రయత్నించాలి. ప్రిపరేషన్‌కు సబ్జెక్టు నిపుణుల సహకారం తీసుకోవాలి. రోజుకు 8-10 గంటలను ప్రిపరేషన్‌కు కేటాయించడం మంచిది.
  • సిలబస్‌లోని అంశాలను విశ్లేషించుకొని, సరైన మెటీరియల్‌ను సేకరించుకోవాలి. ప్రణాళిక ప్రకారం సిలబస్‌ను పూర్తిచేయాలి. రోజూ ఇంజనీరింగ్ సబ్జెక్టులతో పాటు జనరల్ అవేర్‌నెస్, జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్‌కు సమయం కేటాయించాలి.
  • గ్రూప్ డిస్కషన్ కూడా విజయానికి బాటలు వేస్తుంది. దీనిద్వారా తెలియని విషయాలు తెలుసుకునేందుకు అవకాశముంటుంది. అయితే గ్రూప్ స్టడీలో అనవసర చర్చలు లేకుండా జాగ్రత్తపడాలి. ప్రిపరేషన్‌లో ఏవైనా సందేహాలు వస్తే, ఎప్పటికప్పుడు వాటిని స్నేహితులు, ఫ్యాకల్టీ సహాయంతో నివృత్తి చేసుకోవాలి.
  • కాన్సెప్టులను బాగా ప్రాక్టీస్ చేయడం వల్ల పరీక్షలో చాలా సమయం ఆదా అవుతుంది.

జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్ :
ఇందులో వెర్బల్, నాన్ వెర్బల్ ప్రశ్నలు ఉంటాయి. అనాలిజీస్, సిమిలారిటీస్, డిఫరెన్సెస్, స్పేస్ విజువలైజేషన్, ప్రాబ్లం సాల్వింగ్, అనాలిసిస్ తదితర అంశాలు సిలబస్‌లో ఉన్నాయి. తార్కిక ఆలోచనా సామర్థ్యాన్ని పరీక్షించేలా ప్రశ్నలు ఉంటాయి. ఆర్.ఎస్.అగర్వాల్ పుస్తకం ప్రిపరేషన్‌కు ఉపయోగపడుతుంది. ప్రాక్టీస్‌కు ప్రాధాన్యమివ్వడం ద్వారా ఇందులో ఎక్కువ మార్కులు తెచ్చుకోవచ్చు.

జనరల్ అవేర్‌నెస్ :
తన చుట్టూ ఉన్న పరిసరాలు, వర్తమాన సంఘటనలపై అవగాహనను పరీక్షించేలా ఈ విభాగంలో ప్రశ్నలు ఉంటాయి. అభ్యర్థులు కరెంట్ అఫైర్స్‌తో పాటు చరిత్ర, సంస్కృతి, జాగ్రఫీ, ఎకానమీ, పాలిటీ, శాస్త్రీయ పరిశోధన తదితర అంశాలపైనా దృష్టిసారించాల్సి ఉంటుంది. దినపత్రికలను చదువుతూ, ముఖ్యాంశాలతో ప్రత్యేకంగా నోట్స్ రాసుకోవడం ద్వారా ఈ విభాగంపై పట్టు సాధించొచ్చు.

జనరల్ ఇంజనీరింగ్ :
ఎలక్ట్రికల్: పేపర్-1 సిలబస్‌లో సర్క్యూట్ లా, మ్యాగ్నటిక్ సర్క్యూట్, ఏసీ ఫండమెంటల్స్, ఎలక్ట్రికల్ మెషీన్స్, జనరేషన్-ట్రాన్స్‌మిషన్-డిస్ట్రిబ్యూషన్ తదితర అంశాలను పొందుపరిచారు. పేపర్-2లో బేసిక్ కాన్సెప్టులు, ఏసీ ఫండమెంటల్స్, మెజర్‌మెంట్ అండ్ మెజరింగ్ ఇన్‌స్ట్రుమెంట్స్; ఎలక్ట్రికల్ మెషీన్స్, సింక్రనస్ మెషీన్స్; జనరేషన్-ట్రాన్స్‌మిషన్-డిస్ట్రిబ్యూషన్, బేసిక్ ఎలక్ట్రానిక్స్ తదితర అంశాలున్నాయి.
రిఫరెన్స్: నెట్‌వర్క్ థియరీ (ఎన్.సి.జగన్); ఎలక్ట్రిక్ మెషీన్స్ (పి.ఎస్.బింభ్రా); బి.ఎల్.థెరాజా; పవర్ సిస్టమ్స్-సి.ఎల్.వాధ్వా, జె.బి.గుప్తా; కంట్రోల్ సిస్టమ్స్ (ఎం.గోపాల్).
Ex:
1. The torque of 3 phase induction motor at running is directly proportional to..
1. 1) Slip
2) (Slip)2
3) ÖÖ Slip
4) 1/Slip
Ans: 1

సివిల్, స్ట్రక్చరల్ :
పేపర్-1లో బిల్డింగ్ మెటీరియల్స్, ఎస్టిమేటింగ్, కాస్టింగ్ అండ్ వాల్యుయేషన్, సర్వేయింగ్, సాయిల్ మెకానిక్స్, హైడ్రాలిక్స్, ఇరిగేషన్ ఇంజనీరింగ్ తదితర అంశాలున్నాయి. స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ నుంచి థియరీ ఆఫ్ స్ట్రక్చర్స్, కాంక్రీట్ టెక్నాలజీ, ఆర్‌సీసీ డిజైన్, స్టీల్ డిజైన్ అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. పేపర్-2లో సివిల్, స్ట్రక్చరల్ ఇంజనీరింగ్‌కు సంబంధించిన అంశాలు విస్తృతంగా ఉన్నాయి. స్ట్రక్చరల్ ఇంజనీరింగ్, సాయిల్ మెకానిక్స్, ఇరిగేషన్ ఇంజనీరింగ్, సర్వేయింగ్ అంశాలు ముఖ్యమైనవి. వీటి నుంచి ఎక్కువ ప్రశ్నలు వచ్చేందుకు అవకాశముంది.
రిఫరెన్స్: ఆర్.ఎస్.ఖుర్మి; గుప్తా అండ్ గుప్తా.
Ex:
1. Water content of soil can..
1) Be less than 0 percent
2) Be greater than 100 percent
3) Never be greater than 100 percent
4) Take values only from 0 percent to 100 percent
Ans: 2

మెకానికల్ :
పేపర్-1లో థియరీ ఆఫ్ మెషీన్‌‌స, మెషీన్ డిజైన్, ఇంజనీరింగ్ మెకానిక్స్, స్ట్రెంథ్ ఆఫ్ మెటీరియల్స్, థర్మోడైనమిక్స్ లాస్, ఐసీ ఇంజన్స్, రిఫ్రిజిరేషన్ సైకిల్స్ తదితర అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. పేపర్-2లో థియరీ ఆఫ్ మెషీన్స్ అండ్ మెషీన్ డిజైన్, థర్మల్ ఇంజనీరింగ్, ఫ్లూయిడ్ మెకానిక్స్ అండ్ మెషినరీ, ఫ్లూయిడ్ స్టాటిస్టిక్స్, ఫ్లూయిడ్ కైనమేటిక్స్, హైడ్రాలిక్ టర్బయిన్స్ తదితర అంశాలున్నాయి. ప్రధానంగా ఇంజనీరింగ్ మెకానిక్స్, స్ట్రెంథ్ ఆఫ్ మెటీరియల్స్, మెషీన్ డిజైన్ అంశాలపై దృష్టిసారించాలి.
రిఫరెన్స్: ఆర్.ఖుర్మి, డి.ఎస్.కుమార్, మెకానికల్ ఇంజనీరింగ్ క్వశ్చన్ బ్యాంక్ (జి.కె.పబ్లికేషన్స్), ఆర్.కె.జైన్, ఆర్.కె.బన్సల్.
Ex:
Electrostatic precipitators (ESP) are largely used in..
1) Thermal power plants
2) Nuclear power plants
3) Water treatment plants
4) All
Ans: 1
Published date : 01 Nov 2017 04:07PM

Photo Stories