Joint Collector: డ్రాపవుట్స్ లేకుండా చేస్తున్నాం
గుంటూరు వెస్ట్: పాఠశాలల్లో చేరకుండా ఉండే చిన్నారులను గుర్తించి వారిని తిరిగి చేర్చే విధంగా కృషి చేస్తున్నామని జాయింట్ కలెక్టర్ జి.రాజకుమారి తెలిపారు. గురువారం రాష్ట్ర సచివాలయం నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి నిర్వహించిన వీడియో సమావేశానికి స్థానిక కలెక్టరేట్ నుంచి జేసీ మాట్లాడుతూ జిల్లాలో గ్రాస్ ఎన్రోల్‌మెంట్ రేషియోకు సంబంధించి 560 క్లస్టర్ సచివాలయాల్లో ఇప్పటి వరకు 551 క్లస్టర్ సచివాలయాల్లో నూరు శాతం పూర్తి చేసామన్నారు. 1వ నుంచి 10వ తరగతి వరకు పిల్లలు డ్రాపవుట్స్ లేకుండా పాఠశాలలకు పంపిస్తున్నామన్నారు. చిన్నారుల తల్లిదండ్రులకు విద్యపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. దీంతోపాటు ఇంటర్ ఉత్తీర్ణత సాధించని వారిని తిరిగి కళాశాలల్లో చేర్పిస్తున్నామని చెప్పారు. సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ ఎ.శ్రావణ్ కుమార్, డీఈఓ శైలజ, జెడ్పీ సీఈఓ జె.మోహన్‌రావు పాల్గొన్నారు.
చదవండి: NMMS Exam: ఎన్‌ఎంఎంఎస్ పరీక్షకు దరఖాస్తు చేసుకోండి