Education at Govt School: ఏపీ విద్యా రంగంలో మార్పులు.. పథకాలతో తల్లిదండ్రలకు భారం తగ్గింపు!
అమరావతి:
ఫలించిన చదువుల యజ్ఞం
రాష్ట్రంలో సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం చేపట్టిన చదువుల యజ్ఞం ఫలించింది. ఐదేళ్లలో విద్యారంగంపై రూ.72,919 కోట్లు ఖర్చు చేసి అద్భుతమైన ఫలితాలు సాధించింది. జగనన్న విద్యాకానుకతో తల్లిదండ్రులకు పుస్తకాలు, యూనిఫాం వంటి భారం లేకుండా పోయింది. అమ్మ ఒడితో విద్యార్థుల డ్రాపవుట్లు ఆగిపోయాయి. ‘మనబడి నాడు–నేడు’తో రాష్ట్రంలోని 45 వేల ప్రభుత్వ పాఠశాలలు సమున్నతంగా మారాయి. కొత్త పాఠశాల భవనాలు, డబుల్ డెస్క్ బెంచీల నుంచి కాంపౌండ్ వాల్ వరకు దాదాపు 11 రకాల సదుపాయాలు సమకూరాయి.
Earthquakes: వరుస భూకంపాలు.. 24 గంటల్లో 80 సార్లు కంపించిన భూమి.. ఎక్కడంటే..
పిల్లలకు మధ్యాహ్న భోజనంలో జగనన్న గోరుముద్ద కింద నాణ్యమైన పోషకాలతో కూడిన రుచికరమైన భోజనం అందుతోంది. దేశంలో ఈ తరహా భోజనం పిల్లలకు అందిస్తున్న రాష్ట్రం మరొకటి లేదని కేంద్ర ప్రభుత్వమే ప్రకటించింది. దేశ చరిత్రలోనే ఎక్కడాలేని విధంగా 45 వేల ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం అమలుతో పేదింటి పిల్లల చదువులు సమున్నత స్థాయికి చేరాయి. ప్రాథమిక పాఠశాలల్లో స్మార్ట్ టీవీలు, ఉన్నత పాఠశాలల్లో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్లతో డిజిటల్ బోధన అందించడంతో విద్యార్థుల్లో సామర్థ్యాలు పెరిగాయి.
2022–23, 2023–24 విద్యా సంవత్సరాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 93 శాతం మంది విద్యార్థులు ఇంగ్లిష్ మీడియంలోనే పరీక్షలు రాసి ఉత్తీర్ణులయ్యారు. తాజాగా, పదో తరగతి ఫలితాల్లోను అత్యధిక మంది ప్రభుత్వ విద్యార్థులు ఇంగ్లిష్ మీడియంలో పరీక్షలు రాసి విజయం సాధించారు. ఒకప్పుడు కార్పొరేట్ స్కూళ్లు, కాలేజీలకే పరిమితమైన ‘స్టేట్ టాపర్స్’.. గత రెండు విద్యా సంవత్సరాల్లో పది, ఇంటర్మిడియట్‌లో ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కాలేజీ విద్యార్థులే సాధించడం గమనార్హం. ఇలా టాపర్స్‌గా వచ్చిన 10 మంది విద్యార్థులు రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులుగా ఐక్యరాజ్యసమితిలో ప్రసంగించి ఏపీ విద్యా సంస్కరణలను ప్రపంచానికి చాటిచెప్పారు.
10th Class Results: ప్రతిభ చాటిన పేదింటి పిల్లలు
నాడు–నేడులో సకల సౌకర్యాలు
జగన్ ప్రభుత్వం వచ్చాక మనబడి నాడు–నేడు కింద ప్రతి ప్రభుత్వ పాఠశాలలోను టాయిలెట్ నుంచి తాగునీరు వరకు విద్యార్థులకు అవసరమైన 11 రకాల వసతులు కల్పించారు. మొదటి దశలో 15,715 పాఠశాలలు అభివృద్ధి చేయగా, రెండో విడతలో 22,344 పాఠశాలల్లో అభివృద్ధి పనులు చేపట్టారు. పనులు పూర్తయిన హైస్కూళ్లకు 62 వేల ఐఎఫ్‌పీలు, ఎలిమెంటరీ స్కూళ్లకు 45 వేల స్మార్ట్ టీవీలు అందించి ‘డిజిటల్ బోధన’ ప్రవేశపెట్టారు. ఎనిమిదో తరగతి విద్యార్థులకు బైజూస్ కంటెంట్‌తో 9,52,925 ట్యాబ్‌లు అందించారు. రాష్ట్ర ప్రభుత్వం 2020–21లో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం బోధన ప్రవేశపెట్టింది. విద్యార్థులకు బైలింగ్వుల్ పాఠ్య పుస్తకాల(ఇంగ్లిష్+తెలుగు/ఉర్దూ)ను అందించింది.
మండలానికి రెండు జూనియర్ కాలేజీలు
రాష్ట్రంలోని ప్రతి మండలంలోను రెండు ప్రభ్వుత జూనియర్ కాలేజీలు తప్పనిసరిగా ఉండాలని, వాటిలో ఒకటి బాలికల కోసం కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు అనుగుణంగా కొత్తగా 292 ఉన్నత పాఠశాలలు బాలికల కోసం హైస్కూల్ ప్లస్‌గా అప్‌గ్రేడ్ చేశారు. మొత్తం 352 కేజీబీవీల్లో ఇంటర్మీడియట్ విద్యను ప్రవేశపెట్టారు. 2022–23 నుంచి 14 కో–ఎడ్ జూనియర్ కళాశాలలను బాలికల జూనియర్ కళాశాలలుగా మార్చారు. మొత్తం 679 మండలాల్లో రెండు ప్రభుత్వ జూనియర్ కాలేజీలు ఉండడమే కాకుండా బాలికల కోసం ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాల అందుబాటులోకి వచి్చంది.
ఫలితాల్లో టాప్ లేపారు
గతేడాది ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించిన పది, ఇంటర్ విద్యార్థులు 22,710 మంది ఉంటే, ఈ ఏడాది ఒక్క ఇంటర్‌లోనే 15 వేల మందికి పైగా ఉన్నారు. ఈ ఏడాది పదో తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధించారు. గతేడాది ‘0’ఫలితాలు సాధించిన ప్రభుత్వ పాఠశాలలు 6 ఉంటే ఈ ఏడాది ఒక్కటి మాత్రమే ఉంది. గతేడాది 100 శాతం ఫలితాలు సాధించిన సర్కారు బడులు 162 ఉంటే ఈ సంవత్సరం ఆ సంఖ్య 666కి పెరిగింది. ‘పది’లో 18 వేల మందికి పైగా విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించారు.
పెరిగిన చేరికలు
2019–20లో 15,715 పాఠశాలలను రూ.3,669 కోట్లతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. రెండో విడతలో రూ.8 వేల కోట్లతో 22,344 పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నారు. పిల్లలను బడికి పంపుతున్న 44,48,865 మంది తల్లుల ఖాతాల్లో ఏటా రూ.15 వేల చొప్పున అమ్మఒడి నగదు జమ చేస్తున్నారు. నిరంతర నీటి సదుపాయంతో కూడిన టాయిలెట్లు ఉండడంతో డ్రాపవుట్లు నిలిచిపోయాయి. కార్పొరేట్ విద్యా సంస్థలే ప్రభుత్వ పాఠశాలలను అనుసరించే పరిస్థితి వచ్చింది.
ఈ సంవత్సరం ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు 1,50,005 మంది విద్యార్థులు అదనంగా ప్రభుత్వ స్కూళ్లు, ఇంటర్ కాలేజీల్లో చేరారు. ప్రాథమిక స్థాయిలో 84.48 శాతంగా ఉన్న చేరికల శాతం ఇప్పుడు 100 శాతానికి పెరిగింది. సెకండరీ స్థాయిలో 79.69 శాతం నుంచి 100 శాతానికి, హయ్యర్ సెకండరీ స్థాయిలో 46.88 శాతం నుంచి 79.69 శాతానికి పెరిగింది.
Andhra Pradesh Schools: అమ్మ ఒడి.. సర్కారు బడి.. జగన్ ఇచ్చిన నమ్మకం
మన చదువులకు జాతీయ స్థాయిలో గుర్తింపు
‘జగనన్న గోరుముద్ద’కు జాతీయ అవార్డు రావడంతో పలు రాష్ట్రాల మంత్రులు, అధికారులు ప్రశంసించారు. ఏపీ విద్యా సంక్షేమ పథకాలను తమ రాష్ట్రాల్లోను అమలు చేసేందుకు ఆసక్తి చూపారు. మహారాష్ట్ర, ఒడిశా, అసోం, హరియాణా, ఛత్తీస్‌గఢ్, మిజోరాం, మధ్యప్రదేశ్, పశి్చమ బెంగాల్, నాగాలాండ్, గుజరాత్, పుదుచ్చేరి, కేరళ, తెలంగాణ, అండమాన్–నికోబార్, డామన్ డయ్యూ, దాద్రానగర్ హవేలీ విద్యాశాఖాధికారులు మన విద్యా విధానాలను వారి రాష్ట్రాల్లోనూ, కేంద్రపాలిత ప్రాంతాల్లోనూ అమలు చేసేందుకు ముందుకు వచ్చారు. అమెరికాలోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో సుస్థిర అభివృద్ధి లక్ష్యాలపై జరిగిన ఉన్నత స్థాయి సదస్సులో 140 దేశాల విద్యావేత్తలు మన ప్రభుత్వ విద్యా సంస్కరణలను కొనియాడారు.
బోధన–పాఠ్యాంశాల్లో సంస్కరణలు
మూసపద్ధతిలో బోధనను మార్చి క్లాస్‌రూమ్ బేస్డ్ అసెస్‌మెంట్‌ను అమలు చేస్తున్నారు. పిల్లల్లో మెరుగైన అభ్యసన ఫలితాల కోసం 3 నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు సబ్జెక్ట్ టీచర్లను నియమించారు. అన్ని పాఠశాలల్లో సబ్జెక్టు ఉపాధ్యాయుల అవసరాలు తీర్చేందుకు దాదాపు 25 వేల మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించారు. సీబీఎస్‌ఈ బోధనకు అనుగుణంగా టీచర్లకు శిక్షణ ఇచ్చారు. ఐబీ సిలబస్ బోధన కోసం టీచర్ల శిక్షణకు చర్యలు ప్రారంభించారు.
2,23,270 మంది ఇంగ్లిష్‌లోనే పరీక్ష
ఇంగ్లిష్ మీడియం బోధనతో 2022–23 విద్యా సంవత్సరంలో 84 శాతం మంది విద్యార్థులు ఇంగ్లి‹Ùలోనే పరీక్షలు రాసి ఉత్తీర్ణులైతే, 2023–24 సంవత్సరంలో ఆ సంఖ్య 93 శాతానికి పెరిగింది. ఈ ఏడాది 2,23,270 మంది ఇంగ్లిష్ మీడియంలో పదో తరగతి పరీక్షలు రాస్తే.. 1,96,067 మంది పాసయ్యారు. వాస్తవానికి ఇప్పటి దాకా ఇంగ్లిష్ మీడియం బోధన 9వ తరగతి వరకు అందిస్తున్నారు. కానీ బైలింగ్వుల్ పుస్తకాలతో పదో తరగతి విద్యార్థులు 2023–24 విద్యా సంవత్సరంలో ఇంగ్లిష్ మీడియంలో పరీక్షలు రాసి విజయం సాధించారు. ప్రభుత్వ పాఠశాలల్లో దాదాపు 43 లక్షల మంది విద్యార్థులు చదువుతుండగా, 39 లక్షల మందికి పైగా ఇంగ్లిష్ మీడియంలోనే పరీక్షలు రాస్తుండడం విశేషం.
విద్యార్థులకు పోషకాహారం
ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు చదివే విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలనే గొప్ప ఆలోచనతో 2020, జనవరి 1న రాష్ట్ర ప్రభుత్వం ‘జగనన్న గోరు ముద్ద’పథకానికి శ్రీకారం చుట్టింది. గత ప్రభుత్వం సాంబారు, ముద్ద అన్నంతో సరిపెట్టగా, ఈ ప్రభుత్వం రోజుకో మెనూ చొప్పున వారానికి 16 రకాల పదార్థాలతో పాటు ఫోరి్టఫైడ్ సార్టెక్స్ బియ్యంతో భోజనం అందిస్తున్నారు.
పిల్లల్లో రక్తహీనతను అరికట్టడానికి వారంలో మూడు రోజులు బెల్లంతో చేసిన రాగి జావ, మూడు రోజులు చిక్కీ, వారంలో ఐదు రోజులు కోడిగుడ్డును తప్పనిసరి చేశారు. మధ్యాహ్న భోజనానికి గత టీడీపీ ప్రభుత్వం ఏటా రూ.450 కోట్లు ఖర్చు చేస్తే, ప్రస్తుత ప్రభుత్వం ఏటా రూ.1,449 కోట్ల చొప్పున ఖర్చు చేసింది. ప్రతి గురువారం స్థానిక ప్రభుత్వ వైద్యశాల, విలేజ్ క్లినిక్ సిబ్బంది ప్రభుత్వ బడులకే వచ్చి విద్యార్థులకు వైద్య పరీక్షలు చేసి, విద్యార్థుల్లో రక్తహీనతను తగ్గించేందుకు మాత్రలు ఇస్తున్నారు.
‘కార్పొరేట్’ను తలదన్నేలా ఫలితాలు
ఒకప్పుడు కార్పొరేట్ విద్యా రంగానికే పరిమితమైన స్టేట్ ర్యాంకులు 2022–23 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ విద్యార్థులు సొంతం చేసుకున్నారు. ప్రతిభ కనబరిచిన 22,768 మంది విద్యార్థులను ‘జగనన్న ఆణిముత్యాలు’గా ప్రభుత్వం సత్కరించింది. రాష్ట్ర స్థాయిలో ప్రతిభావంతులను ఎంపిక చేసి ప్రభుత్వం అమెరికా పర్యటనకు పంపించింది. తొలిసారి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 10 మంది విద్యార్థులు రాష్ట్ర ప్రతినిధులుగా ఐక్యరాజ్యసమితిలో అమెరికా అధ్యక్ష భవనం సాక్షిగా ఏపీ విద్యా సంస్కరణలను ప్రపంచానికి వినిపించారు.
1000 సీబీఎస్‌ఈ స్కూళ్లు
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పిల్లలకు మొదటి విడతగా 2023–23 విద్యా సంవత్సరంలో 1,000 ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్‌ఈ సిలబస్ అమలు చేశారు. ఈ స్కూళ్లలోని విద్యార్థులు 2024–25 విద్యా సంవత్సరంలో తొలిసారి పదో తరగతి పరీక్షలు సీబీఎస్‌ఈ విధానంలో రాస్తారు.
‘టోఫెల్’ శిక్షణ
విద్యార్థుల్లో ఆంగ్ల భాషా నైపుణ్యాలను పెంచేందుకు, వారు అంతర్జాతీయ స్థాయిలో రాణించేందుకు మరో గొప్ప నిర్ణయం తీసుకున్నారు. 2023–24లో మూడో తరగతి నుంచే ‘టోఫెల్’ శిక్షణ ప్రారంభించారు. టోఫెల్ ప్రైమరీలో 3 నుంచి 5 తరగతులకు, టోఫెల్ జూనియర్‌లో 6 నుంచి 9 తరగతుల విద్యార్థులకు ఇంగ్లిష్ శిక్షణనిస్తున్నారు. 20 లక్షల
మంది పిల్లలకు ఈ సదుపాయం లభించింది.
ప్రభుత్వ స్కూళ్లలో ఐబీ విద్య
‘మన పేదింటి పిల్లలు అంతర్జాతీయంగా ఎదగాలి. ప్రపంచానికి దిక్సూచిగా మారాలి’ అన్న ఆలోచనతో ప్రభుత్వ బడుల్లోకి ‘ఇంటర్నేషనల్ బాకలారియేట్(ఐబీ) బోధన తెస్తున్నారు. ఇప్పటిదాకా దేశంలో 210 ప్రముఖ కార్పొరేట్ స్కూళ్లలో సంపన్నుల పిల్లలకు మాత్రమే ఐబీ బోధన అందుబాటులో ఉంది. 2025 జూన్ నుంచి రాష్ట్రంలోని 38 వేల ప్రభుత్వ పాఠశాలల్లో దీన్ని ప్రారంభిస్తున్నారు. విద్యార్థులకు ‘సంకల్పం’పేరుతో లైఫ్ స్కిల్స్‌ను నేరి్పస్తున్నారు. ఈ శిక్షణ అభివృద్ధి చెందిన దేశాల్లోని స్కూళ్లలో మాత్రమే అందిస్తున్నారు.
ఐటీలో ‘ఫ్యూచర్ స్కిల్స్’
రాష్ట్రంలోని 6790 ఉన్నత పాఠశాలల్లో వచ్చే విద్యా సంవత్సరం (2024–25) నుంచి ‘ఫ్యూచర్ స్కిల్స్’బోధన అందిస్తారు. ఎనిమిదో తరగతి నుంచి ఐటీ రంగంలోని కీలకమైన 10 కోర్సులపై శిక్షణ ఇస్తారు. ఇంటర్నెట్ థింకింగ్స్, ఆరి్టఫిíÙయల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషిన్ లెరి్నంగ్ (ఎంఎల్), బ్లాక్‌చైన్ టెక్నాలజీ, వర్చువల్ రియాలిటీ (వీఆర్), ఆగ్మెంటెడ్ రియాలిటీ (ఏఆర్), మెటావర్స్/వెబ్ 3.0, 3డీ మోడలింగ్ అండ్ ప్రింటింగ్, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, రోబోటిక్స్ కోర్సులు ఉన్నాయి.
UPSC CMS 2024 Notification: 827 మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలు.. రాత పరీక్షలో రాణించే మార్గాలు ఇవే..
Tags
- AP Govt Schools
- students education
- govt schools development
- Education Schemes
- jagananna amma odi
- vidhya deveena
- Digital education
- ap nadu nedu
- English Medium Schools
- skills development for students
- AP government
- Jagananna Gorumudda
- Poor Students
- higher education
- Government School Education
- TOEFL Coaching
- IB Education
- private schools
- free education
- Education News
- Sakshi Education News
- amaravathi news
- andhra pradesh news
- ap schools development
- ap education updates
- AP Education Schemes