No School Teachers: విద్యార్థులకు ‘పరీక్ష’
ప్రారంభంలో హడావుడి చేసిన విద్యాశాఖ అధికారులు డిప్యుటేషన్ల విషయంలో వెనకడుగు వేస్తున్నారు. దీంతో పలు పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్లు లేకపోవడంతో పుస్తకాలు తెవకుండానే విద్యార్థులు ఏఫ్‌ఏ–1పరీక్షలు రాయాల్సి వస్తోంది. ఈ విషయం విద్యార్థుల ద్వారా తెలుసుకున్న తల్లిదండ్రులు అధికారులు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పిల్లల భవిష్యత్‌తో ఆటలాడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
చదవండి: New Exam Pattern in AP: విద్యార్థుల సామర్థ్యాలను వెలికితీతే లక్ష్యంగా నూతన పరీక్ష విధానం
అలసత్వం..
జిల్లాలో 898 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా ఇందులో 3,690 మంజూరు టీచర్ పోస్టులు ఉన్నాయి. 3,126 మంది పనిచేస్తున్నారు. 564 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటితో పాటు153 పాఠశాలల్లో విద్యార్థులు లేరనే నెపంతో 170మందికి పైగా ఉపాధ్యాయులు వేరే పాఠశాలకు వెళ్లాల్సి ఉంటుంది. అయితే అధికారులు డిప్యుటేషన్ల ప్రక్రియ పూర్తి చేకపోవడంతో కొంతమంది ఉపాధ్యాయులు ఖాళీగా ఉంటున్నారు. మరికొంత మంది ఉపాధ్యాయులు ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయుల విన్నపం మేరకు స్కూళ్లకు వెళ్లి విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నారు.
చదవండి: Open Tenth అభ్యర్థులు రీ వెరిఫికేషన్‌కు దరఖాస్తులు
ముందుకు కదలని ఫైల్..
నెలరోజుల క్రితం ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియను ప్రారంభించిన జిల్లా విద్యాశాఖ అధికారులు ఇప్పటి వరకు పూర్తి చేయలేదు. ఉపాధ్యాయుల మిగులు, అవసరాలను దృష్టిలో ఉంచుకొని జాబితా తయారు చేసి డిప్యుటేషన్లు ఇవ్వాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. దీంతో నోడల్ హెచ్‌ఎంలు వారి క్లస్టర్‌లోని పాఠశాలల పరిస్థితులకు అనుగుణంగా డిప్యుటేషన్ల జాబితాను తయారు చేసి మండల విద్యాశాఖ అధికారులకు, అక్కడి నుంచి జిల్లా విద్యాశాఖ అధికారులకు అందజేసినట్లు సమాచారం.
ఈ క్రమంలో కొందరు ఉపాధ్యాయులు తమకు అనుకూలమైన స్కూల్ కోసం, మరికొందరు డిప్యుటేషన్ల రద్దుకోసం ఉపాధ్యాయ సంఘాల నాయకులు, రాజకీయ నాయకులతో ఫైరవీలు చేసినట్లు సమాచారం. దీంతో నోడల్ హెచ్‌ఎం నుంచి వెళ్లిన ఫైళ్లలో కొందరు ఎంఈఓల వద్ద మార్పులు జరిగినట్లు సమాచారం.
అలాగే జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో పనిచేస్తున్న కొందరు ఉద్యోగులు తమకు తెలిసిన వారికి అనుకూలమైన పాఠశాలను కేటాయించేందుకు డీఈఓ ద్వారా ప్రయత్నాలు చేసినట్లు ప్రచారం. ఇలా నెలరోజుల క్రితం పూర్తి చేయాల్సిన ఉపాధ్యాయుల డిప్యుటేషన్ ప్రక్రియ ఇప్పటికి పూర్తి కాలేదు.
‘మహబూబాబాద్ మండలం ముడుపుగల్లు ఉన్నత పాఠశాలలో 10వ తరగతి వరకు ఉంది. ఈ పాఠశాలలో ఇంగ్లిష్, బయోసైన్స్, ఫిజికల్ సైన్స్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కాగా ఏటా పాఠశాల ప్రారంభం నుంచే డిప్యుటేషన్ల ప్రక్రియ చేపట్టే అధికారులు ఈ ఏడాది ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో పాఠాలు వినకుండానే విద్యార్థులు ఎఫ్‌ఏ–1పరీక్షలు రాయాల్సిన పరిస్థితి ఏర్పడింది’.
- ఉపాధ్యాయుల సర్దుబాటులో అలసత్వం
- ముందుకు కదలని డిప్యుటేషన్ల ఫైల్
- 50 రోజుల క్రితం పాఠశాలల
- పునఃప్రారంభం
- పలు స్కూళ్లలో సబ్జెక్టు టీచర్ లేక
- పాఠాలు కోల్పోతున్న విద్యార్థులు
- పుస్తకాలు తెరవకుండానే పరీక్షలు
జిల్లాలో ఉపాధ్యాయుల వివరాలు
పోస్టు |
మంజూరు |
పనిచేస్తున్నవారు |
ఖాళీలు |
గ్రేడ్–2 హెచ్‌ఎం |
92 |
53 |
39 |
ఎస్‌ఏ మ్యాథ్స్ |
228 |
215 |
13 |
ఎస్‌ఏ ఫిజిక్స్ |
163 |
157 |
06 |
ఎస్‌ఏ బయోసైన్స్ |
179 |
133 |
46 |
ఎస్‌ఏ సోషల్ |
212 |
154 |
58 |
ఎస్‌ఏ తెలుగు |
73 |
56 |
17 |
ఎస్‌ఏ హిందీ |
38 |
31 |
07 |
ఎస్‌ఏ ఇంగ్లిష్ |
158 |
139 |
19 |
ఎస్‌ఏ ఫిజికల్ ఎడ్యుకేషన్ |
15 |
07 |
08 |
పీఎస్ హెచ్‌ఎం |
132 |
66 |
66 |
ఎల్‌పీ తెలుగు |
149 |
138 |
11 |
ఎల్‌పీ హిందీ |
126 |
120 |
06 |
ఎస్‌జీటీ |
2057 |
1800 |
257 |
పీఈటీ |
58 |
55 |
03 |
డ్రాయింగ్ |
02 |
00 |
02 |
క్రాఫ్ట్ |
08 |
02 |
06 |
మొత్తం |
3,690 |
3,126 |
564 |