Students: విద్యార్థులు ఉన్నతస్థాయికి ఎదగాలి
Sakshi Education
బూర్గంపాడు: ప్రభుత్వ గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులు సౌకర్యాలను సద్వినియోగం చేసుకుంటూ శ్రద్ధగా చదివి ఉన్నతస్థాయికి ఎదగాలని తానా మాజీ అధ్యక్షుడు, తాళ్లూరి ట్రస్ట్ డైరెక్టర్ తాళ్లూరి జయశేఖర్ ఆకాంక్షించారు. బూర్గంపాడులోని తెలంగాణ రాష్ట్ర గురుకుల పాఠశాల(బాలికలు)లో మౌలిక వసతుల కల్పనకు శుక్రవారం ఆయన రూ.2 లక్షల ఆర్థికసాయం అందజేశారు. ఈ సందర్భంగా జయశేఖర్ మాట్లాడుతూ గురుకుల విద్యార్థులు పాఠ్యాంశాలపై పట్టు పెంచుకుంటూనే కంప్యూటర్ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. తద్వారా మంచి అవకాశాలు ఉంటాయని చెప్పారు. పాఠశాల ప్రిన్సిపాల్ రాజ్యలక్ష్మి, పీఏసీఎస్ చైర్మన్ బిక్కసాని శ్రీనివాసరావుతో పాటు వల్లూరిపల్లి వంశీకృష్ణ, గోనెల నాని, చావా లక్ష్మీనారాయణ, శ్యాం, పుష్కర్‌రావు తదితరులు పాల్గొన్నారు.
Published date : 19 Aug 2023 07:48PM