పాఠశాలల అభివృద్ధికి శాలసిద్ధి దోహదం
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాఠశాల స్థాయిని ఏడు విభాగాలుగా నిర్ణయించి, వాటిలో వెనుకబడిన అంశాలను గుర్తించాలన్నారు. పాఠశాలను ఏవిధంగా అభివృద్ధి చేయాలనే దానిపై కార్యచరణను రూపొందించుకోవాలని సూచించారు. శాలసిద్ది మదింపు చేయాలని, ఇది పాఠశాల అభివృద్దికి దోహదం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సెక్టోరియల్ అధికారిణి ఎస్తేర్‌రాణి, ఆర్పీలు చంద్రశేఖర్, హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.
వేరుశనగ క్వింటా రూ.5536
గద్వాల వ్యవసాయం: గద్వాల మార్కెట్ యార్డుకు బుధవారం 167 క్వింటాళ్ల వేరుశనగ విక్రయానికి వచ్చింది. క్వింటాకు గరిష్టం రూ.5536, కనిష్టం రూ. 3159, సరాసరి రూ. 4360 ధరలు లభించాయి.
ఐటీ టవర్‌లో‘ఎస్2 ఇంటిగ్రేటర్స్’
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: అమెరికాకు చెందిన సాఫ్ట్‌వేర్ కంపెనీ ‘ఎస్2 ఇంటిగ్రేటర్స్’ దివిటిపల్లిలోని ఐటీ టవర్‌లో ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. ఈ మేరకు ఆ సంస్థకు చెందిన ప్రతినిధులు శ్రీకాంత్ లింగిడి, శ్రీనివాసన్ సంతాన హైదరాబాద్‌లోని మినిస్టర్స్ క్వార్టర్స్‌లో బుధవారం రాష్ట్ర ఎకై ్సజ్, క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో సమావేశమయ్యారు. ఇందులో సుమారు 100 మంది యువతకు సాఫ్ట్‌వేర్ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. ఈ పరిశ్రమ ను త్వరలోనే నెలకొల్పుతామన్నారు. కాగా, ప్రభుత్వం తరఫున అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. స్థానికంగా అర్హత కలిగిన యువతకు ఉద్యోగాల్లో మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పట్నం నరేందర్‌రెడ్డి, అబ్రహం, బొల్లం మల్లయ్యయాదవ్ పాల్గొన్నారు.
నేడు డయల్ యువర్ ఆర్‌ఎం
స్టేషన్ మహబూబ్‌నగర్: డయల్ యువర్ ఆర్టీసీ ఆర్‌ఎం కార్యక్రమాన్ని గురువారం నిర్వహిస్తున్నట్లు రీజినల్ మేనేజర్ వి.శ్రీదేవి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు ప్రయాణికులు తమ సూచనలు, సలహాలను 9959226295 నంబర్‌కు తెలియజేయాలని ఆమె కోరారు.