Skip to main content

Sankranti Festival 2024 Holidays : జ‌న‌వ‌రి 9 నుంచి అన్ని ప్ర‌భుత్వ‌, ప్రైవేట్ స్కూల్స్‌కు సంక్రాంతి సెల‌వులు.. మొత్తం ఎన్ని రోజులంటే..?

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని అన్ని ప్ర‌భుత్వ‌, ప్రైవేట్ పాఠ‌శాల‌ల‌కు ఈ సారి సంక్రాంతి పండ‌గ సెల‌వులు భారీగానే ఇచ్చారు. అక‌డ‌మిక్ క్యాలెండ‌ర్ ప్ర‌కారమే అన్ని ప్ర‌భుత్వ‌, ప్రైవేట్ పాఠ‌శాల‌ల‌కు జ‌న‌వ‌రి 9వ తేదీ (మంగ‌ళ‌వారం) నుంచి జ‌న‌వ‌రి 18వ తేదీ వ‌ర‌కు (గురువారం)వ‌ర‌కు సెల‌వులు ఇవ్వాల‌ని అన్ని జిల్లాల విద్యాశాఖ అధికారులు అన్ని స్కూల్స్‌ యాజ‌మాన్యాల‌కు క‌ఠిన ఆదేశాలు ఇచ్చారు.
January 9th to January 18th Break   Sankranti Vacation for Students   Sankranti Break for Schools  Sankranti Break for Schools  Education Department Announcement  sankranti festival 2024 holidays for students   Andhra Pradesh School Holidays

అన్ని ప్ర‌భుత్వ‌, ప్రైవేట్ పాఠ‌శాల‌ల‌కు 9 రోజులు పాటు సంక్రాంతి సెల‌వులు రానున్నాయి. ఒక వేళ సెల‌వుల్లో స్కూల్స్ నిర్వ‌హిస్తే.. క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని విద్యాశాఖ అధికారులు హెచ్చ‌రించారు. అలాగే అన్ని ప్ర‌భుత్వ‌, ప్రైవేట్ పాఠ‌శాల‌లు తిరిగి జ‌న‌వ‌రి 19వ తేదీన(శుక్ర‌వారం) పునప్రారంభం అవుతాయి. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అత్య‌తం వైభవంగా జ‌రుపుకునే పండ‌గ‌ల్లో సంక్రాంతి పండ‌గ ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉంటుంది. తెలంగాణ‌లో కంటే.. ఏపీలోనే సంక్రాంతి పండ‌గ ఘ‌నంగా జ‌రుపుకుంటారు. అలాగే ఏపీలో కాలేజీల‌కు కూడా దాదాపు 5 నుంచి 6 రోజులు పాటు సంక్రాంతి సెల‌వులు ఇవ్వ‌నున్నారు.

☛ AP Holidays 2024 List : ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో సాధారణ సెలవులు ఇవే.. స్కూల్స్‌, కాలేజీల‌కు మాత్రం..

తెలంగాణ‌లో మాత్రం..

holidays news telangana

తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా స్కూల్స్‌, కాలేజీల‌కు సంక్రాంతి పండుగ సెల‌వుల‌ను ప్ర‌క‌టించింది. తెలంగాణ‌లోని స్కూల్స్‌కు జనవరి 12వ తేదీ నుంచి 17వ తేదీ వరకు సెలవులు ఉంటాయని ప్రభుత్వం ఓ ప్రకటనలో పేర్కొంది. మిషనరీ స్కూళ్లకు మినహా అన్ని స్కూళ్లకు ఈ సెలవులు వర్తిస్తాయని పేర్కొంది. ఇక, జనవరి 13న రెండో శనివారం కాగా.. 14న భోగి, 15న సంక్రాంతి, 16న కనుమ పండుగలు ఉన్నాయి. అలాగే జనవరి 25, 26న కూడా సెలవు రానుంది.

కాలేజీల‌కు..
తెలంగాణలోని ఇంటర్మీడియట్ కాలేజీల‌కు జనవరి 13వ తేదీ నుంచి 16వ తేదీ వరకు సెలవులను ఇంట‌ర్ బోర్డ్‌ ప్రకటించింది. మొత్తం 4 రోజుల పాటు కాలేజీల‌కు సెల‌వులు రానున్నాయి. జనవరి 17వ తేదీన‌ తిరిగి ఇంటర్మీడియట్ కళాశాలు తెరుచుకోనున్నాయి. అలాగే డిగ్రీ, ఇంజ‌నీరింగ్ కాలేజీల‌కు కూడా దాదాపు నాలుగు రోజులు పాటు సంక్రాంతి సెలవులు రానున్నాయి.

 Telangana Holidays 2024 List : 2024 స్కూల్స్‌, కాలేజీల‌కు సెల‌వులు ఇవే.. ఏడాదిలో మొత్తం ఎన్ని రోజులు హాలిడేస్ అంటే..?

Published date : 05 Jan 2024 01:33PM

Photo Stories