Open School Education: ఓపెన్‌స్కూలు విద్యార్థులు ఇంజనీర్లుగా, డాక్టర్లుగా...
Sakshi Education
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన ఆకస్మిక తనిఖీలను ఓపెన్‌స్కూల్ స్టేట్ అబ్జర్వర్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల చదువు గురించి వారి భవిష్యత్తు గురించి తెలిపారు.
సాక్షి ఎడ్యుకేషన్: ఓపెన్‌స్కూలులో చదివిన విద్యార్థులు ఇంజనీర్లుగా, డాక్టర్లుగా వివిధ రంగాల్లో స్థిరపడ్డారని ఓపెన్‌స్కూల్ స్టేట్ అబ్జర్వర్ అక్బర్‌వలి అన్నారు. ఆదివారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఓపెన్‌స్కూల్ ఇంటర్ విద్యార్థులకు నిర్వహిస్తున్న తరగతిని ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు.
➤ Best Teachers Awards: రోటరీ సంఘాల ద్వారా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు..
ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులు క్రమం తప్పకుండా తరగతులకు హాజరు కావాలని, అధ్యాపకులు చెప్పే పాఠాలు శ్రద్ధగా వినడం వల్ల పరీక్షల్లో ఉత్తీర్ణులవుతారన్నారు. వివిధ కారణాల వల్ల చదువు మానేసిన విద్యార్థుల భవిష్యత్ కోసం ప్రభుత్వం ఓపెన్‌స్కూల్ విధానాన్ని అమలు చేస్తోందన్నారు. జిల్లా కో ఆర్డినేటర్ సుబ్బారెడ్డి, శివ, ప్రిన్సిపాల్ రామిరెడ్డి, అధ్యాపకులు రంతుబాష, సుబ్బారావు పాల్గొన్నారు.
Published date : 30 Oct 2023 12:57PM