Skip to main content

Open School Exams: మధ్యాహ్నం సమయంలో ఒపెన్‌ స్కూల్‌, ఇంటర్‌ పరీక్షలు..

ఒపెన్‌ స్కూల్‌, ఇంటర్‌ పరీక్షలు ఈనెల 18 నుంచి జరుగుతాయని జిల్లా విద్యాశాఖాధికారి తెలిపారు. ఈ మెరకు విద్యార్థులంతా ఆన్‌లైన్‌లో తమ హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించారు..
Open School and Inter Exams from March 18th

నంద్యాల: ఏపీ సార్వత్రిక విద్యాపీఠం (ఓపెన్‌) స్కూల్‌ పదవ తరగతి, ఇంటర్మీడియెట్‌ పరీక్షలు ఈనెల 18 నుంచి 27వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి సుధాకర్‌రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయన్నారు.

Inter Spot Valuation: ఇంటర్‌ స్పాట్‌ షురూ.. మూల్యాంకన ప్రక్రియ ఇలా..

ఇంటర్మీడియెట్‌ ప్రాక్టికల్స్‌ పరీక్షలు ఈనెల 30 నుంచి ఏప్రిల్‌ 3వ తేదీ వరకు జరుగుతాయని వివరించారు. హాల్‌టికెట్లను https:// apopenschool.ap.gov.in వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్‌ చేసుకోవాలన్నారు. డౌన్‌లోడ్‌ చేసుకున్న హాల్‌టికెట్లపై ఓపెన్‌ స్కూల్‌, కాలేజీ హెచ్‌ఎం, ప్రిన్సిపాల్‌ సంతకం చేయించుకోవాలన్నారు.

Model Foundation School: ఈ పాఠశాలలే మోడల్‌ ఫౌండేషన్‌ స్కూళ్లుగా ఎంపికైయ్యాయి

Published date : 16 Mar 2024 05:32PM

Photo Stories