Skip to main content

NMMS Model Test: 26న ఎన్‌ఎంఎంఎస్‌ మోడల్‌ టెస్ట్‌

November 26, Statewide NMMS Model Exam, Statement on NMMS Model Examination, Class VIII Students Taking NMMS Model Exam, NMMS Model Test on 26th, AP School Assistants Association, Bapatla District General Secretary CHTV Suresh,

బాపట్ల అర్బన్‌: ఎనిమిదో తరగతి విద్యార్థులకు నేషనల్‌ మీన్స్‌ కమ్‌ మెరిట్‌ స్కాలర్‌షిప్‌ (ఎన్‌ఎంఎంఎస్‌) మోడల్‌ పరీక్షను నవంబర్ 26న రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు ఏపీ స్కూల్‌ అసిస్టెంట్స్‌ అసోసియేషన్‌ బాపట్ల జిల్లా జనరల్‌ సెక్రటరీ సీహెచ్‌.టి.వి.సురేష్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో అన్ని మండల కేంద్రాల్లో ఆ రోజు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష జరుగుతుందని పేర్కొన్నారు. డిసెంబర్‌ 3న జాతీయ ఉపకార వేతన పరీక్ష (ఎన్‌ఎంఎంఎస్‌)కు హాజరవుతున్న విద్యార్థులకు ఈ మోడల్‌ పరీక్ష ఎంతగానో ఉపయోగపడుతోందని తెలిపారు. పరీక్షలో ఎంపికై న విద్యార్థులకు తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్‌ వరకు కేంద్ర ప్రభుత్వం మెరిట్‌ స్కాలర్‌ షిప్‌ మంజూరు చేస్తుందని తెలియజేశారు. వివరాలకు ఏపీ స్కూల్‌ అసిస్టెంట్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు కె. పిచ్చయ్య (98498 98808), జనరల్‌ సెక్రటరీ సురేష్‌ (9030557325)లను సంప్రదించాలని కోరారు.

చ‌ద‌వండి: Admissions in Sainik Schools: AISSEE నోటిఫికేషన్‌ విడుదల.. మంచి మార్కులకు మార్గమిదే

Published date : 23 Nov 2023 03:21PM

Photo Stories