Skip to main content

NCC వార్షిక శిక్షణ ప్రారంభం

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: జిల్లా కేంద్రంలోని ఎంవీఎస్‌ డిగ్రీ కళాశాలలో 8వ బెటాలియన్‌ ఎన్‌సీసీ వార్షిక శిక్షణ ప్రారంభమైంది.
NCC
NCC వార్షిక శిక్షణ ప్రారంభం

 ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వివిధ కళాశాలల్లో చదువుతున్న ఎన్‌సీసీ క్యాడెట్‌ విద్యార్థులు శిక్షణకు హాజరయ్యారు. క్యాంప్‌ కమాండర్‌ ఎస్‌కే సింగ్‌ మాట్లాడుతూ పది రోజుల పాటు నిర్వహించే డ్రిల్‌, వెపన్‌ ట్రైనింగ్‌, ఫైరింగ్‌, అబ్‌స్టాకిల్‌ వంటి వాటిలో శిక్షణ ఉంటుందని తెలిపారు.

చదవండి: NCC Special Entry Scheme: ఇండియన్‌ ఆర్మీలో ఎన్‌సీసీ స్పెషల్‌ ఎంట్రీ స్కీమ్‌ ప్రవేశాలు.. ఎవరు అర్హులంటే..

వ్యక్తిత్వ వికాసం పెంపొందించేందుకు దేశభక్తి, నాయకత్వం, జీవననైపుణ్యాలు, జాతీయ సమైక్యత, జాతి నిర్మాణం వంటి అంశాలపై అవగాహన కల్పిస్తామన్నారు. కార్యక్రంమలో ఎన్‌సీసీ అధికారులు కుల్‌దీప్‌సింగ్‌, విజయ్‌కుమార్‌, రాజేశ్వరి, కరుణాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Published date : 03 Aug 2023 03:32PM

Photo Stories