Skip to main content

School Admissions: ప్రైవేటు, కార్పొరేటు పాఠశాలల్లో ప్రవేశానికి చివరి తేదీ..?

ప్రైవేటు, కార్పొరేటు పాఠశాలలో ప్రవేశానికి గడువును పొడగించినట్లు డీఈఓ తెలిపారు. కాగా, పాఠశాలలో ప్రవేశం పొందేందుకు అర్హుల గురించి కూడా వివరించారు..
Date Extended for admissions at Private and Corporate Schools

 

నంద్యాల: 2024–25 విద్యా సంవత్సరానికి ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాలల్లో 1వ తరగతిలో 25 శాతం సీట్లలో ఉచితంగా ప్రవేశాలకు ఈనెల 31వ తేదీ వరకు గడువు పొడిగించినట్లు డీఈఓ సుధాకర్‌రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 25వ తేదీ వరకు ఉన్న గడువును ప్రభుత్వం పొడిగించిందన్నారు. విద్యార్థుల నివాసానికి సమీపంలో ఉన్న ఐబీ, సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ, స్టేట్‌ సిలబస్‌ అందిస్తున్న అన్ని ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాలలో ప్రవేశం పొందవచ్చని వివరించారు.

National Award: భూగర్భ డ్రిప్‌ ‘స్వర్‌’ రూపశిల్పి గోపాల్‌కు జాతీయ పురస్కారం

ఆసక్తి గల వారు https://cse.ap.gov.in వెబ్‌సైట్‌లో రిజిస్టర్‌ చేసుకోవాలని పేర్కొన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు గ్రామ సచివాలయం/ ఎంఆర్‌సీ సెంటర్‌/ఎంఈఓ ఆఫీస్‌, సంబంధిత పాఠశాల నుంచే దరఖాస్తు చేసుకోవచ్చునని పేర్కొన్నారు. అర్హులై న విద్యార్థులకు లాటరీ ద్వారా సీట్ల కేటాయింపు ఉంటుందన్నారు. వివరాలకు టోల్‌ ఫ్రీ నంబర్‌ 18004258599కి ఫోన్‌ చేసి తెలుసుకోవచ్చని సూచించారు.

Bharat Ratna Awards: భారతరత్న అవార్డులు ప్రదానం చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

Published date : 30 Mar 2024 03:04PM

Photo Stories