Kakatiya University: పీహెచ్‌డీ ప్రవేశాల్లో అవకతవకలు
తొలుత ప్రిన్సిపాల్ కార్యాలయంలోని ఉద్యోగులను బయటకు పంపించారు. పీహెచ్‌డీ ప్రవేశాల్లో సీట్లు పొందిన అభ్యర్థులు జాయినింగ్ రిపోర్టు ఇచ్చేందుకు రాగా ఈ ఆందోళనతో వారు కార్యాలయ ఆవరణ, వివిధ చోట్ల నిరీక్షించారు. ఈ సందర్భంగా వివిధ విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ పీహెచ్‌డీ అడ్మిషన్లలో యూనివర్సిటీ అధికారులు అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు.
చదవండి: KU: పరీక్ష ఒకటి.. పేపర్ మరొకటి.. రాసినా 'నో ప్రాబ్లమ్'..!?
వివిధ విభాగాల్లో పార్ట్‌టైం అభ్యర్థులకే ఎక్కువ సీట్లు వచ్చాయని తెలిపారు. వీసీ కనుసన్నల్లోనే అక్రమాలు జరిగాయని, అడ్మిషన్లు రద్దుచేసి పారదర్శకంగా జరపాలని డిమాండ్ చేశారు. దీనిపై సమాచారం అందుకున్న కేయూ ఎస్సైలు సురేష్, విజయ్‌కుమార్..సిబ్బందితో కలిసి ఘటనా స్థలికి చేరుకుని ఆందోళనకారులను అక్కడి నుంచి పంపేందుకు ప్రయత్నించారు. దీంతో ఆగ్రహంతో కొందరు విద్యార్థి సంఘాల నాయకులు ప్రిన్సిపాల్ ఆఫీస్‌లోని కంప్యూటర్, అద్దాలు, కుర్చీని పగలగొట్టారు.
చదవండి: Kakatiya University: దూరవిద్య డిగ్రీ పరీక్షల్లో 9 మంది డీబార్
మరోగదిలో మానిటర్, ప్రింటర్‌ను ధ్వంసం చేశారు. దీంతో పోలీసులు ఏబీవీపీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ మాచర్ల రాంబాబు, రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యుడు అంబాల కిరణ్, నాయకుడు ప్రశాంత్, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆరెగంటి నాగరాజు, మరో ఇద్దరు అంకిల శంకర్, మట్టెడకుమార్‌ను అరెస్ట్ చేసి స్టేషన్ తరలించారు. దీంతో క్యాంపస్‌లో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి.