Science Lab: పాఠశాలలో మొబైల్ సైన్స్ ల్యాబ్‌ను ప్రారంభించి విద్యార్థులకు ప్రోత్సాహాన్ని అందించిన కలెక్టర్..
విద్యార్థులు సైన్స్‌పై మక్కువ పెంచుకుని, పరిశోధనలు చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. జిల్లా కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలలో అగస్త్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే మొబైల్ సైన్స్ ల్యాబ్‌ను మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. మొబైల్ సైన్స్ ల్యాబ్‌తో విద్యార్థుల వద్దకే ప్రయోగాత్మక బోధన వస్తుందన్నారు.
Degree Classes: మహిళా డిగ్రీ కళాశాలలోనే తరగతులు
దీనిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. విద్యార్థులు ప్రశ్నించే తత్వం అలవాటు చేసుకోవాలన్నారు. సంస్థ జనరల్ మేనేజర్ బలరాం, ఏరియా మేనేజర్ శ్రీదేవి మాట్లాడుతూ.. తమ సంస్థ ద్వారా మొబైల్ సైన్స్ ల్యాబ్‌లను జిల్లాలో 8 పాఠశాలల్లో ప్రవేశపెడుతున్నామన్నారు. 23 రాష్ట్రాల్లో ఈ సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థుల్లో సృజనాత్మకత, తెలుసుకోవాలనే కుతూహలం, ప్రేరేపించడం, ప్రయోగాత్మకమైన బోధన ద్వారా ప్రతీ గ్రామీణ ప్రాంత విద్యార్థికి సైన్స్‌లో మెలకువలు నేర్పడానికి సైన్స్ పరిజ్ఞానం విస్తృతం చేయడానికి కృషి చేస్తామన్నారు.
Pre Matric, Post Matric Scholarship: స్కాలర్‌షిప్ హార్డ్ కాపీలు అందించాలి
అనంతరం విద్యార్థులు తయారుచేసిన సైన్స్ ప్రయోగాలను కలెక్టర్, డీఈవో రవీందర్‌రెడ్డి, అధికారులు పరిశీలించారు. వాటి పనితీరును అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి వినోద్‌కుమార్, ఎంఈవో శంకర్, సెక్టోరియల్ ఆఫీసర్లు శ్రీదేవి, నర్సయ్య, పరీక్షల సహాయ కమిషనర్ పద్మ, కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్లు సుజాత, లత, దేవి తదితరులు పాల్గొన్నారు.