PRTU Leaders : సమస్యల పరిష్కారానికి డీఈఓను సందర్శించిన పీఆర్‌టీయూ నాయకులు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జిల్లాలో ఉపాధ్యాయులు దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని పీఆర్‌టీయూ నాయకులు డీఈఓ ఎం. వెంకటలక్ష్మమ్మను కోరారు. శుక్రవారం ఆమెను కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల ఎన్నికల నిర్వహణలో పాల్గొన్న ఉపాధ్యాయులకు డ్యూటీ సర్టిఫికెట్లు జారీ చేయాలని, సంపాదిత సెలవులు ఇప్పించాలని, కాంపెన్సేటరీ సెలవులు మంజూరు చేయాలని, పని సర్దుబాటులో భాగంగా సర్‌ప్లస్ ఉపాధ్యాయులను నియమించాలని కోరారు. అపార్ నమోదు ఒత్తిళ్లపై కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లాలన్నారు. హైస్కూల్ ప్లస్‌లో ఖాళీగా ఉన్న పీజీటీ పోస్టులను భర్తీ చేయాలన్నారు. జిల్లా అధ్యక్షుడు పువ్వుల ఆంజనేయులు, ఎం.రాంబాబు, ఎస్‌డీ ముర్సలీన్ తదితరులు ఉన్నారు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Tags
- teachers issues
- DEO Office
- PRTU Leaders
- school teachers
- DEO Venkatalaxmamma
- duty certificate for teachers
- PGT Posts
- district collector
- surplus teachers
- high school plus
- teachers recruitments
- School Teachers Problems
- Education News
- Sakshi Education News
- PRTU Leaders
- Eluru District Education
- Eluru education problems