Gurukul Schools: బీసీ గురుకుల పాఠశాలల సొంత భవనాలకు చర్యలు..
సాక్షి ఎడ్యుకేషన్: మహాత్మా జ్యోతిబాపూలే బీసీ గురుకుల పాఠశాలలకు సొంత భవనాలను నిర్మించడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందు కోసం 2024–25 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో బీసీ గురుకుల పాఠశాలలకు రూ. 1,546 కోట్ల నిధులను కేటాయించింది. జిల్లాలో నియోజకవర్గానికి ఒక బాలుర, బాలికల గురుకుల పాఠశాలలను గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం 2017–18లో మంజూరు చేసింది. మొదట్లో పదో తరగతి వరకే విద్యాబోధన అందించినా దశల వారీగా ఇంటర్‌ను ప్రవేశపెట్టారు.
Private Schools: విద్యార్థులకు ప్రైవేటు పాఠశాలల్లో ఉచితంగా ప్రవేశాలకు దరఖాస్తులు.. తేదీ విడుదల..!
మోర్తాడ్, కుద్వాన్‌పూర్(ఆర్మూర్), ఆర్మూర్, బాల్కొండ, చీమన్‌పల్లి, ఎడపల్లి, నిజామాబాద్, బోధన్‌లలో బీసీ గురుకుల పాఠశాలలు కొనసాగుతున్నాయి. ఐదు నియోజకవర్గాల్లోని పది గురుకులాలు అద్దె భవనాలు లేదా అరకొర వసతులు ఉన్న ప్రభుత్వ భవనాల్లో కొనసాగుతున్నాయి. ఎక్కడ కూడా గురుకుల పాఠశాలలకు సొంత భవనాలను నిర్మించలేదు. ప్రభుత్వ స్థలాలు అందుబాటులో ఉన్నా భవనాల నిర్మాణానికి నిధులను మంజూరు చేయలేదు. ప్రతి పాఠశాలకు కనీసం ఐదెకరాల స్థలం అవసరమని బీసీ గురుకుల పాఠశాలల యాజమాన్యం నిర్ధారించింది.
Degree Exams Fees: డిగ్రీ విద్యార్థుల పరీక్షకు ఫీజు చెల్లించాలి.. ఇదే చివరి తేదీ..!
ప్రతి పాఠశాలలో 400ల నుంచి 500ల మంది విద్యార్థులకు విద్యాబోధన అందిస్తున్నారు. సొంత భవనాలు అందుబాటులోకి వస్తే ఇంటర్, డిగ్రీ కూడా అమలు చేసే అవకాశం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్‌లో నిధులు కేటాయించడంతో సొంత భవనాల నిర్మాణం కోసం స్థలం సేకరించి త్వరలోనే భవనాల నిర్మాణానికి పునాదిరాయి వేసే అవకాశం ఉంది.