Skip to main content

Gurukul Admissions: గురుకుల పాఠశాలకు దరఖాస్తులు..

గురుకుల పాఠశాలల్లో ఐదో తరగతి ఇంగ్లీషు మీడియంలో ప్రవేశాలకు దరఖాస్తులు ఉన్నట్లు ఐటీడీఏ తెలిపారు..
Opportunity for fifth-grade students to join Gurukula schools    Apply now for admissions in boys and girls Gurukula schools  Gurukul school admissions for fifth class english medium   Admission notice for English medium fifth grade in Gurukula schools

సాక్షి ఎడ్యుకేషన్‌: రంపచోడవరం, చింతూరు ఐటీడీఏల పరిధిలో 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి గురుకుల పాఠశాలల్లో ఐదో తరగతి ఇంగ్లీషు మీడియంలో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతున్నట్టు ఐటీడీఏ పీవో సూరజ్‌గనోరే తెలిపారు. రెండు బాలురు, మూడు బాలికల గురుకులాల్లో ఇంగ్లీషు మీడియంలో ప్రవేశాలకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు కోరుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.

JNTU: జేఎన్‌టీయూని సందర్శించిన ఉప కులపతి..

ప్రతీ పాఠశాలకు ఐదో తరగతిలో 80 సీట్లు ఉన్నట్లు ఆయన తెలిపారు. ఎస్టీ–55, ఎస్సీ–10, ఓసీ–2, ఉద్యోగస్తుల కోటా–2, పీహెచ్‌సీ–2, పీటీజీ –5 చొప్పున మొత్తం 400సీట్లు ఉన్నాయని ఆయన వివరించారు. అలాగే ఆరో తరగతిలో –12, ఏడో తరగతిలో–8, 8వ తరగతిలో 5, 9వ తరగతిలో –11 సీట్లు బ్యాక్‌లాగ్‌ సీట్లు ఖాళీ ఉన్నట్లు తెలిపారు. దరఖాస్తు చేసుకునేందుకు ఏప్రిల్‌ 10తేదీ వరకు గడువు ఉందని ఆయన పేర్కొన్నారు.

Published date : 19 Feb 2024 08:40AM

Photo Stories