Andhra Pradesh: ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారిపోయాయి
నాడు–నేడు ద్వారా కనీవినీ ఎరుగని రీతిలో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. పాఠశాలలో చదువుకున్న పూర్వవిద్యార్థులు పాఠశాలను చూసి తాము చదువుకున్న పాఠశాల ఇదేనా అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. నూతన తరగతి గదుల నిర్మాణం, బెంచీలు, అధునాతన టాయిలెట్‌లు, ఫ్యాన్‌లు, పుష్టికరమైన మధ్యాహ్నభోజనం తదితర అన్ని సౌకర్యాలను కల్పించారు. లక్షల రూపాయల ఫీజు కట్టే కార్పొరేట్ స్కూళ్లలో కూడా లేని ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్ బోర్డ్స్(ఏఎఫ్‌పీ ప్యానల్స్) ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధన జరుగుతోంది. అత్యాధునిక పద్ధతుల ద్వారా జ్ఞానాన్ని అందించే విధంగా ప్రభుత్వం తీసుకుంటున్న విప్లవాత్మక మార్పులు ప్రశంసనీయం.
– కాశీప్రసాదరెడ్డి, వైవీఎస్‌మున్సిపల్ హైస్కూల్, ప్రొద్దుటూరు.
చదవండి: Govt High School: ఇది మా స్కూలేనా..!
ఇంటి వద్దకే ధ్రువీకరణ పత్రాలు
గ్రామ సచివాలయ వలంటీర్ వచ్చి ఆధార్‌కార్డుతో పాటు రేషన్ కార్డు తీసుకొని మా సచివాలయం పరిధిలో జరిగిన జగనన్న సురక్ష కార్యక్రమంలో దరఖాస్తు చేయించారు. తర్వాత ఇంటి వద్దకే వచ్చి పలు రకాల ధ్రువీకరణపత్రాలు అందజేశారు. నాకు కుల, ఆదాయ ధ్రువీకరణపత్రాలు ఉచితంగానే అందాయి. గతంలో మా పిల్లల చదువుల నిమిత్తం వీటి కోసం తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఇప్పుడు ఉచితంగా ఇంటికే తెచ్చి ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉంది.
– టి.రమణ, కొత్తపల్లి, చిన్నమండెం మండలం