School Students : మెరిట్ విద్యార్థులకు ప్రోత్సాహకాన్ని వెంటనే అందించాలి..
గత ప్రభుత్వం ఇచ్చిన విధంగానే టెన్త్, ఇంటర్‌లో ప్రతిభ కనబరచిన విద్యార్థులకు వెంటనే నగదు ప్రోత్సాహక బహుమతులు అందజేయాలి. గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వీటిని ప్రతి ఏటా కొనసాగిస్తామని చెప్పారు. ప్రస్తుత సీఎం చంద్రబాబు, లేదా విద్యాశాఖామంత్రి లోకేష్ వెంటనే స్పందించి ‘ఆణిముత్యాలు’ పథకాన్ని వెంటనే అమలు చేసి మెరిట్ విద్యార్థులను ప్రోత్సహించాలి.
–బాబ్జాన్, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు
Software Engineer Jobs: వచ్చే 2-3 ఏళ్లలో 10 లక్షల ఉద్యోగాలు!..ఈ రంగాల్లో ఇంజనీర్లకు భారీగా డిమాండ్
మార్గదర్శకాలు రావాలి
2022–23 విద్యాసంవత్సరంలో ప్రభుత్వ బడుల్లో చదువుతూ రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, పాఠశాల స్థాయిల్లో టెన్త్, ఇంటర్‌లో ప్రతిభ కనబరచిన విద్యార్థులకు అప్పటి ప్రభుత్వం నగదు ప్రోత్సాహకాలు ఇచ్చిన మాట వాస్తవమే. 2023–24 విద్యాసంవత్సరానికి గానూ ఇప్పటి వరకూ ప్రభుత్వం నుంచి ఎలాంటి మార్గదర్శకాలు విడుదల కాలేదు. రాగానే మెరిట్ విద్యర్థులను గుర్తించి నగదు ప్రోత్సాహకాలు అందేలా చూస్తాం.
–మీనాక్షి, జిల్లా విద్యాశాఖ అధికారి