Food Safety Awareness: మధ్యాహ్న భోజనంతోనే విద్యార్థులు బడి బాట
Sakshi Education
కంప్లి: పాఠశాలల్లో మధ్యాహ్న వేడి భోజనం తయారు చేసే సిబ్బంది చేతి వంట రుచి వల్లనే ఎక్కువ మంది విద్యార్థులు బడికి డుమ్మా కొట్టకుండా వస్తున్నారని సిరిగేరి ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎం శివకుమార్ తెలిపారు.
ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే పాఠశాలల్లో ఏర్పాటు చేసిన ఆహార సురక్షత జాగృతి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మధ్యాహ్న భోజన పథకం 2003 నుంచి అమలులో ఉందన్నారు. పాఠశాలల్లో వంట చేసే సిబ్బంది పిల్లల భవిష్యత్తును కాపాడి సక్రమంగా బడికి వచ్చేలా చేస్తున్నారన్నారు.
Also read: TET - AP Deputy EO: Trends in Education - మొట్టమొదటి మధ్యాహ్న భోజన పథకం ఎక్కడ ప్రారంభమైంది.
Published date : 30 Aug 2023 06:33PM