Kasturba Gandhi School: విద్యార్థినుల అర్ధాకలి
Sakshi Education
చిన్నగూడూరు: మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ పాఠశాలలో పదిరోజులుగా మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదు.
దీంతో విద్యార్థినులు అర్ధాకలితో అలమటిస్తున్నారు. కాగా మూడు నెలలుగా బిల్లులు రాకపోవడంతో సదరు కాంట్రాక్టర్ సరుకులు తీసుకురావడం లేదని తెలిసింది. అల్పాహారంలో అందించే స్నాక్స్, రాగిజావ, టిఫిన్ సామగ్రి తీసుకురావడం లేదు. అలాగే ప్రతీరోజు మధ్యాహ్నం, రాత్రి సోరకాయ, బీరకాయ, టమాట, చారుతో నిర్వాహకులు విద్యార్థినులకు వడ్డిస్తున్నారు.
చదవండి: Free Training: ఎలక్ట్రీషియన్ కోర్సులో ఉచిత శిక్షణ
దీంతో సరైన భోజనం అందక విద్యార్థిను లు ఇళ్లకు వెళ్తున్న విషయం తెలుసుకున్న జీసీడీఓ విజయకుమారి సెప్టెంబర్ 25న పాఠశాలను సందర్శించారు. విద్యార్థినులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. భోజనంలో మెనూ పాటించడం లేదంటూ విద్యార్థినులు జీసీడీఓకు వివరించారు. కాగా పెండింగ్‌బిల్లులు చెల్లిస్తామని, 15 రోజుల వరకు సరుకులు పంపించాలని సదరు కాంట్రాక్టర్‌కు ఆమె సూచించారు.
Published date : 26 Sep 2023 04:12PM