Skip to main content

Chess Tournament: ఉత్సాహంగా ఏపీ స్కూల్స్‌ ర్యాంకింగ్‌ చెస్‌ టోర్నమెంట్‌

మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): చెస్‌ ఆడటం వల్ల విద్యార్థుల్లో ఏకాగ్రత పెరగడమే కాకుండా శరీరంలోని మెదడు చురుకుగా పనిచేస్తుందని ఆదాయపు పన్ను శాఖ జాయింట్‌ కమిషనర్‌ వి.కోటేశ్వరమ్మ చెప్పారు.
Chess Benefits, Exciting AP Schools Ranking Chess Tournament, Chess as a Tool for Active Brain Development in Mogalrajapuram,

స్థానిక కానూరులోని స్కాట్‌ స్పైన్‌ స్కూల్‌ ఆవరణలో ఆంధ్రప్రదేశ్‌ స్కూల్స్‌ ర్యాంకింగ్‌ చెస్‌ టోర్నమెంట్‌ విజేతలకు న‌వంబ‌ర్‌ 20న‌ ఆమె బహుమతులు అందజేశారు. చెస్‌ టోర్నమెంట్‌లో 8 నుంచి 16 ఏళ్ల లోపు వయస్సు ఉన్న 450 మంది విద్యార్థులు పాల్గొన్నారు.

చదవండి: Chess Tournament: సిల్వర్‌ ఓక్స్‌ స్కూల్‌లో చెస్ టోర్న‌మెంట్

డాక్టర్‌ అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ కో–ఆర్డినేటర్‌ డాక్టర్‌ వెలగా జోషి, మెప్మా స్టేట్‌ మిషన్‌ మేనేజర్‌ ఎన్‌ఎన్‌ఆర్‌ శ్రీనివాస్‌, చెస్‌ కోచ్‌ ఎస్‌కే కాశీం, రవీంద్రభారతి స్కూల్‌ డైరెక్టర్‌ శాంతి, ఆంధ్రా చెస్‌ అసోసియేషన్‌ జాయింట్‌ సెక్రెటరీ అమ్మినేని ఉదయ్‌కుమార్‌, ఎస్‌ఆర్‌ఆర్‌ చెస్‌ కోచింగ్‌ అకాడమీ ప్రెసిడెంట్‌ జె.శైలజ, స్కాట్‌ స్పైన్‌ స్కూల్‌ సీఈఓ కె.జాహ్నవి, కృష్ణాజిల్లా చెస్‌ అసోసియేషన్‌ సెక్రటరీ ఎన్‌.ఎం.ఫణి కుమార్‌ పాల్గొన్నారు. వివిధ విభాగాల్లో విజేతలుగా నిలిచిన 120 మంది విద్యార్థులకు బహుమతులు అందజేశారు.

Published date : 21 Nov 2023 12:15PM

Photo Stories