Skip to main content

Entrance Exam: ఆశ్రమోన్నత పాఠశాలల్లో ప్రవేశ పరీక్షకు తేదీ విడుదల..

ఆశ్రమోన్నత పాఠశాలలో ఐదో తరగతి ప్రవేశానికి పరీక్ష గురించి జిల్లా గిరిజనాభివృద్ధి అధికారి శ్రీనివాస్‌రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు..
District Tribal Development Officer Srinivas Reddy making an announcement  Date released for aashram school entrance exam   Children participating in physical tests for Ashramonnatha School admission

కామారెడ్డి: సికింద్రాబాద్‌లోని బోయిన్‌పల్లిలో గల ఆశ్రమోన్నత పాఠశాలలో ఐదో తరగతిలో ప్రవేశం కోసం మార్చి 6 తేదీన జిల్లా స్థాయి ఎంపిక పరీక్ష నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని జిల్లా గిరిజనాభివృద్ధి అధికారి శ్రీనివాస్‌రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. మార్చి 6వ తేదీన జిల్లాకేంద్రంలోని ఇందిరా గాంధీ స్టేడియంలో ఫిజికల్‌ టెస్ట్‌లతోపాటు వయసు నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.

PU Non-Teaching Staff: తాత్కాలిక నాన్‌టీచింగ్‌ సిబ్బందికి పరీక్ష కోసం సర్క్యులర్‌ జారీ..!

జిల్లా స్థాయి పరీక్షలో ఎంపికైనవారికి మార్చి 21న హైదరాబాద్‌లోని హకీంపేట స్పోర్ట్స్‌ స్కూల్‌లో ఎంపిక పరీక్ష ఉంటుందని తెలిపారు. ఆసక్తిగల 9 నుంచి 11 ఏళ్లలోపు విద్యార్థులు ఎంపిక పరీక్షలకు హాజరు కావాలని, ఇతర వివరాలకు కలెక్టరేట్‌లోని జిల్లా గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.

Job Mela: గురువారం డిగ్రీ కళాశాలలో మెగా జాబ్‌ మేళా

Published date : 28 Feb 2024 04:41PM

Photo Stories