National Children's Science Congress: పరిశోదన రంగంవైపు విద్యార్థులకు ప్రోత్సాహం
సాక్షి ఎడ్యుకేషన్: విద్యార్థులను పరిశోధనా రంగం వైపు ప్రోత్సహిస్తూ, బాల శాస్త్రవేత్తలను భావి శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దేందుకు 31వ జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్‌ను విజయవంతం చేయాలని ఎన్టీఆర్ జిల్లా విద్యాశాఖాధికారి సీవీ రేణుక పిలుపునిచ్చారు. జిల్లా విద్యాశాఖాధికారి క్యాంప్ ఆఫీసులో గురువారం దీనికి సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు.
Gold Medal in Medical Exams: వైద్య పరీక్షల్లో బంగారు పతకం సాధించిన యువతి
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శుక్రవారం విజయవాడ ఆంధ్రా లయోలా కాలేజీలో జరగనున్న ఓరియంటేషన్ కార్యక్రమానికి ప్రతి పాఠశాల నుంచి ఒక సైన్స్ టీచర్ హాజరై జిల్లా నుంచి అత్యుత్తమ ప్రాజెక్టులు తయారు చేయించాలని కోరారు. ఈ ఏడాది ఫోకల్ థీమ్ ఆరోగ్యం, శ్రేయస్సు కోసం పర్యావరణ వ్యవస్థను అర్థం చేసుకోవడం అని తెలిపారు. అలాగే మరో ఐదు సబ్ థీమ్స్‌లలో విద్యార్థులు సైన్స్ ప్రాజెక్టులు చేపట్టవచ్చని తెలిపారు. జిల్లా కో–ఆర్డినేటర్ మైనం హుస్సేన్, విజయవాడ డీవైఈఓ కుమార్, రిసోర్స్ పర్సన్స్ పాల్గొన్నారు.