Football Competitions: ఫుట్‌బాల్ క్రీడలో విద్యార్థులకు ప్రోత్సాహం
సాక్షి ఎడ్యుకేషన్: రాష్ట్రంలో ఫుట్‌బాల్ క్రీడకు అత్యంత ఆధరణ కల్పిస్తామని ఏపీ ఫుట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు, ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ అన్నారు. అనంతపురం నగర శివారులోని అనంత క్రీడా గ్రామం (ఆర్డీటీ స్టేడియం)లో మంగళవారం ఆలిండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్‌ఎఫ్) ఆధ్వర్యంలో సబ్ జూనియర్ బాలుర జాతీయ ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్–2023 పోటీలను అట్టహాసంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా కోటగిరి శ్రీధర్ మాట్లాడుతూ.. మన గ్రామీణ ప్రాంతాలకు సరిపోయే క్రీడ ఫుట్‌బాల్ అని, ఇందులో యువతను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో వివిధ స్థాయిల్లో పోటీలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇక నుంచి క్రికెట్‌తో పాటు ఫుట్‌బాల్ కూడా ఆంధ్రప్రదేశ్‌లో క్రియాశీలకమైన క్రీడగా ఉండాలని భావిస్తున్నామన్నారు.
PG Seats Allotment: PG సీట్ల కేటాయింపు పూర్తి వివరాలు ఇవే...
ఈ టోర్నీలో ఆంధ్రప్రదేశ్ ఫైనల్‌కు చేరితే మ్యాచ్‌ను వీక్షించాల్సిందిగా సీఎం వైఎస్ జగన్‌మోహన్‌దరెడ్డిని ఆహ్వానిస్తామని చెప్పారు. కలెక్టర్ ఎం.గౌతమి, ఆర్డీటీ ప్రోగ్రాం డైరెక్టర్ మాంఛో ఫెర్రర్, ఏపీ ఫుట్‌బాల్ అసోసియేషన్ సెక్రెటరీ, శాప్ బోర్డు డైరెక్టర్ డానియల్ ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. కాగా.. ఆంధ్రప్రదేశ్, సిక్కిం జట్ల మధ్య తొలి మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ 1–1 స్కోరుతో డ్రాగా ముగిసింది.