Skip to main content

PG Seats Allotment: PG సీట్ల కేటాయింపు పూర్తి వివరాలు ఇవే...

PG Seats Allotment
PG Seats Allotment

ఎచ్చెర్ల క్యాంపస్‌: ఏపీ పీజీసెట్‌–2023 సీట్ల అలాట్‌మెంట్‌ 27న ప్రకటించనున్నారు. కౌన్సెలింగ్‌ ఇప్పటికే ముగిసింది. సోమవారం ఆప్షన్ల మార్పు సైతం పూర్తయ్యింది. సెట్‌ ఆంధ్రావిశ్వవిద్యాలయం నిర్వహించింది.

రాష్ట్ర విశ్వవిద్యాలయాలు 14, అఫిలియేషన్‌ కళాశాలల్లో సీట్లు కేటాయిస్తారు. విద్యార్థుల ఆప్షన్‌, ర్యాంక్‌, రిజర్వేషన్‌ రోస్టర్‌ ఆధారంగా ఈ ప్రవేశాలు కల్పిస్తారు.

జిల్లా విద్యార్థులు డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయం, ఆంధ్రా విశ్వవిద్యాలయంలో పీజీ కోర్సులకు ప్రాధాన్యత ఇచ్చారు. 27 సాయంత్రం సీట్లు ప్రకటించనున్నారు. సీట్లు లభించిన విద్యార్థులు 29వ తేదీన కళాశాలలకు రిపోర్టు చేయాల్సి ఉంటుంది.

Published date : 26 Sep 2023 06:43PM

Photo Stories