Ekalavya Schools: ఏకలవ్య పాఠశాలలు ఏర్పాటు చేయండి
Sakshi Education
కొరాపుట్: నవరంగ్‌పూర్ జిల్లాలో ఏకలవ్య మోడల్ రెసిడెన్సియల్ పాఠశాలలు ఏర్పాటు చేయాలని నవరంగ్‌పూర్ ఎంపీ రమేష్‌చంద్ర మాఝి కోరారు. ఈ మేరకుకేంద్ర గిరిజన వ్యవహారాల శాఖామంత్రి అర్జున్ ముండాను ఢిల్లీలోని అతని కార్యాలయంలో మంగళవారం కలిసి, వినతిపత్రం అందించారు. నవరంగ్‌పూర్ జిల్లాలో నందాహండి, తెంతులకుంటి, డాబుగాం, చందాహండి సమితులలో వీటిని ఏర్పాటు చేయాలన్నారు. పూర్తిగా వెనుకబడిన ఈ ప్రాంతంలో కేంద్రప్రభుత్వం ఈ విద్యాలయాలు ఏర్పాటు చేస్తే గిరిజన బాలలకు ఉన్నత విద్య అందుతుందని వివరించారు.
Admissions in Open School: ఓపెన్ స్కూల్‌లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
Published date : 09 Aug 2023 02:22PM