Exam Arrangements: టెన్త్, ఇంటర్ పరీక్షల ఏర్పాట్ల గురించి కలెక్టర్ ఆదేశాలు..
సాక్షి ఎడ్యుకేషన్: ఇంటర్మీడియెట్, పదో తరగతి పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లూ పక్కాగా చేయాలని అధికారులను కలెక్టర్ కృతికా శుక్లా ఆదేశించారు. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ కలసి కలెక్టర్లు, జిల్లా విద్యాశాఖాధికారులతో గురువారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టరేట్ నుంచి కలెక్టర్ పాల్గొన్నారు. పరీక్షల నిర్వహణకు చేపట్టిన కార్యాచరణను మంత్రికి వివరించారు.
Inter Exams: ఇంటర్ పరీక్షలకు సమన్వయ సమీక్ష సమావేశం
అనంతరం, జిల్లా అధికారులతో సమీక్షించారు. ప్రశ్న, జవాబు పత్రాల భద్రత, పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు ఫర్నిచర్, లైటింగ్, తాగునీరు, ప్రథమ చికిత్స వంటి సౌకర్యాలు, పరీక్ష సమయాల్లో ఆయా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు, జెరాక్స్ సెంటర్ల మూసివేత, పరీక్ష కేంద్రాల్లో సెల్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్ల వాడకంపై నిషేధం వంటివి పటిష్టంగా అమలు చేయాలని కలెక్టర్ కృతికా శుక్లా ఆదేశించారు. పరీక్ష సమయాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
Nadu-Nedu schools: రూ.492 కోట్లతో పాఠశాలల అభివృద్ధి..
విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకునేందుకు వీలుగా అన్ని పరీక్షా కేంద్రాల రూట్లలో ఎక్కువ సంఖ్యలో బస్సులు నడపాలని ఆర్టీసీ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి తిప్పేనాయక్, విద్యా శాఖ ఆర్‌జేడీ జి.నాగమణి, డీఈఓ పిల్లి రమేష్, జిల్లా ప్రజా రవాణా అధికారి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.