Industry-Academia 2024 : ఇండస్ట్రీ–అకాడెమియా సమ్మేళనం 2024.. ఉపాధి అవకాశాలను పెంచడమే లక్ష్యంగా..
విశాఖ విద్య: సంస్థలు–పరిశ్రమల సమన్వయంతో అభివృద్ధి సాధ్యమని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ(ఐఐపీఈ) డైరెక్టర్ ప్రొఫెసర్ శాలివాహన్ అన్నారు. నగరంలోని ఓ హోటల్‌లో శుక్రవారం ఇండస్ట్రీ–అకాడెమియా సమ్మేళనం 2024 జరిగింది. ఇంధన రంగంలోని పురోగతి, సవాళ్లపై విద్యావేత్తలు, పరిశ్రమల ప్రతినిధులు ఈ సదస్సులో చర్చించారు.
Spot Admissions: ఉర్దూ యూనివర్సిటీలో పీజీ స్పాట్ అడ్మిషన్స్
ఈ సందర్భంగా ఐఐపీఈ డైరెక్టర్ ప్రొఫెసర్ శాలివాహన్ మాట్లాడుతూ విద్యాసంస్థలు, పరిశ్రమల మధ్య సన్నిహిత సహకారం ఎంతో ముఖ్యమన్నారు. విద్యార్థుల భవిష్యత్తును మెరుగుపరచడం, వారికి ఉపాధి అవకాశాలను పెంచడం లక్ష్యంగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఐఐపీఈ డీన్ ప్రొఫెసర్ విజయ్ కుమార్, వివిధ సంస్థల ప్రతినిధులు కనుపర్తి నాగరాజా(హెచ్‌పీసీఎల్), డాక్టర్ సెంథిల్ మురుగన్ బాలసుబ్రమణ్యన్(రిలయన్స్), డా.మురళీకష్ణ కలగ(జీఈ వెర్నోవా), డా.కష్ణకాంత్, డా.హేమంత్ తదితరులు ప్రసంగించారు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)