Skip to main content

చదువుతోనే పేదల స్థితిగతుల్లో మార్పు

తాడేపల్లిగూడెం రూరల్‌ : చదువుతోనే పేదల కుటుంబ స్థితిగతుల్లో మార్పు వస్తుందని, దీనిని గుర్తించిన ఏకై క వ్యక్తి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున అన్నారు.
Change in the status of the poor only through education
చదువుతోనే పేదల స్థితిగతుల్లో మార్పు

ఆరుగొలనులో రూ.22.17 కోట్లతో నిర్మించిన డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాల భవనాలను డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణతో కలిసి ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి నాగార్జున మాట్లాడుతూ రాష్ట్రంలో సీఎం జగన్‌ పరిపాలన అనే మహాయజ్ఞంలో చదువుకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నారన్నారు. అంబేడ్కర్‌ ఆలోచనలను అమలు చేస్తున్నారన్నారు. కరోనా వంటి విపత్తు సమయంలోనూ సమర్థవంతంమైన పాలన అందించారన్నారు. నాడు చంద్రబాబు హైదరాబాద్‌లో బొజ్జున్నాడని ఎద్దేవా చేశారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో ఓట్ల కోసం చంద్రబాబు అర్హులు చాస్తున్నారని, 175 నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థిని నిలబెట్టలేని పరిస్థితుల్లో చంద్రబాబు ఉన్నాడన్నారు. కాపుల సంక్షేమానికి సీఎం జగన్‌ కృషిచేస్తున్నారని, ప్రపంచంలో ఉత్తమ వర్సిటీల్లో విద్యకు కాపు విద్యార్థులను సీఎం జగన్‌ పంపిస్తున్నారన్నారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో గురుకుల పాఠశాల, అంబేడ్కర్‌ భవనాల నిర్మాణ అంశాన్ని సబ్‌ప్లాన్‌లో ముందు వరుసలో తీసుకెళ్తానని ఆయన హామీనిచ్చారు.

గూడెంకు బృహత్తర పథకాలు: మంత్రి కొట్టు

తాడేపల్లిగూడెంలో రాష్ట్రస్థాయిలో క్రీడాకారులను తీర్చిదిద్దేలా 12 ఎకరాల విస్తీర్ణంలో స్టేడియం నిర్మాణం, ప్రభుత్వ ఇంజనీరింగ్‌ కళాశాల, చిన్న పిల్లల ఆస్పత్రి నిర్మాణానికి త్వరలో సీఎం జగన్‌ చేతులమీదుగా శంకుస్థాపన చేయనున్నామని డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ అన్నారు. చిన్న పిల్లల ఆస్పత్రి నిర్మాణానికి రూ.300 నుంచి రూ.350 కోట్లు ఖర్చవుతుందని అంచనా అన్నారు. అలాగే గూడెం నియోజకవర్గ అభివృద్ధికి ఆలోచన, అవగాహనతో ముందుకెళ్తున్నామన్నారు. ఎస్సీ, ఎస్టీ ప్రాంతాల్లో రోడ్లు, డ్రెయినేజీ అభివృద్ధికి రూ.5.50 కోట్లు ప్రతిపాదనలు పంపామని, తర్వలో పనులు సాకారం కానున్నాయన్నారు. కాపు భవన్‌ నిర్మాణానికి స్థలం కేటాయించామని, రూ.3 కోట్లు ప్రభుత్వం, మరో రూ.4 నుంచి రూ.5 కోట్లు కాపు పెద్దల నుంచి సేకరిస్తామన్నారు. కొందరు జనసేన నాయకులను దృష్టిలో ఉంచుకుని ఇక్కడ కాపు భవన్‌ నిర్మాణం చేపడుతున్నామని, దీనిని కాపు సామాజికవర్గానికి ఇన్‌ఫర్‌మేషన్‌ సెంటర్‌గా తీర్చిదిద్దుతామన్నారు. పెదతాడేపల్లి గురుకుల పాఠశాలకు సొంత భవనాల నిర్మాణానికి సహకరించాలని మంత్రి నాగార్జునను కోరారు. రూ.7 కోట్ల ఎఫ్‌డీఆర్‌ నిధులతో నవాబ్‌పాలెం నుంచి కొత్తూరు మీదుగా ఆరుగొలను గురుకులానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రోడ్లు నిర్మిస్తామని మంత్రి కొట్టు తెలిపారు. ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్‌ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో సీఎం జగన్‌ కల్పిస్తున్న సౌకర్యాలను విద్యార్థులు వినియోగించుకోవాలని కోరారు. కలెక్టర్‌ పి.ప్రశాంతి మాట్లాడారు. తొలుత ప్రిన్సిపాల్‌ బీహెచ్‌ శ్రీనివాస్‌ పాఠశాల నివేదికను చదివి వినిపించారు. వసతిగృహాల జేడీ శోభారాణి, జిల్లా సమన్వయాధికారి ఎన్‌.భారతి, తహసీల్దార్‌ వై.దుర్గాకిషోర్‌, ఈవోపీఆర్డీ ఎం.వెంకటేశ్వర్లు, ఎంఈఓ వి.హనుమ, పెదతాడేపల్లి గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌ బి.రాజారావు, జెడ్పీటీసీ ముత్యాల ఆంజనేయులు, ఎంపీపీ పొనుకుమాటి శేషులత, వైస్‌ ఎంపీపీలు సూర్పని రామకృష్ణ, కట్టా రంగబాబు, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్‌ కై గాల శ్రీనివాస్‌, సర్పంచ్‌లు, సొసైటీ చైర్మన్లు, వైఎస్సార్‌ సీపీ నాయకులు పాల్గొన్నారు.

Published date : 31 Jul 2023 03:14PM

Photo Stories