SCERT: పాఠశాలలో మెరుగైన సౌకర్యాలు
రాయగడ జిల్లాలో ఆగస్టు 17న ఆయన పర్యటించారు. కొలనార సమితిలోని కేజీబీవీ, ఒడిశా ఆదర్శ విద్యాలయం, ఆశ్రమ పాఠశాల, స్థానిక గోవింద చంద్రదేవ్ ఉన్నత పాఠశాలలను పరిశీలించారు. విద్యార్థులకు అందుతున్న బోధన, వసతి సౌకర్యాలపై ఆరా తీశారు. గోవింద చంద్రదేవ్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. ప్రతీ విద్యార్థి క్రమశిక్షణతో చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని సూచించారు. ప్రస్తుత యుగంలో సాంకేతికతను అందిపుచ్చుకోవాలన్నారు.
చదవండి: Collector Shashank: పాఠశాలల దత్తతకు ముందుకు రావాలి
ప్రభుత్వం సాంకేతిక విద్యావిధానానికి నాంది పలికిందని, విద్యార్థులు సక్రమంగా వినియోగించుకుని భవిష్యత్‌ను తీర్చిదిద్దుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం జిల్లా విద్యాశాఖ అధికారి పూర్ణచంద్ర భొరియా, జిల్లా అదనపు విద్యాశాఖ అధికారి భజన్ లాల్ మాఝిలతో మాట్లాడి విద్యార్థుల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని ఆదేశించారు. తరుచూ పాఠశాలలను పరిశీలించి ఉపాధ్యాయుల పనితీరు గమనించాలని సూచించారు.
ఉపాధ్యాయుల నియామకంపై దృష్టి
రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీపై ప్రభుత్వం దృష్టి సారిస్తోందని మనోజ్ కుమార్ పాఢి వెల్లడించారు. జిల్లాలో ఉపాధ్యాయుల కొరత గతంలో తీవ్రంగా ఉండేదని, ప్రస్తుతం ఆ సమస్యకు తెరపడిందని పేర్కొన్నారు. అయితే ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను 2023 డిసెంబర్ నాటికి భర్తీ చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని తెలియజేశారు.
చదవండి: Collector Sumit Kumar: విద్యార్థుల డ్రా పౌట్ల వివరాలు సేకరించండి
జిల్లాలో కొండ ప్రాంతాల్లోని పాఠశాలలకు ఉపాధ్యాయులు సకాలంలో హాజరవ్వడం లేదని ఆరోపణలు ఉన్నాయని, దీనిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యా విధానాన్ని మెరుగుపరిచేందుకు యోచిస్తుంటే, అందుకు ఉపాధ్యాయులు సహకరించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు.