Skip to main content

Collector Shashank: పాఠశాలల దత్తతకు ముందుకు రావాలి

కురవి: ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకోవడానికి దాతలు ముందుకు రావాలని కలెక్టర్‌ శశాంక అన్నారు.
Schools should come forward for adoption
పాఠశాలల దత్తతకు ముందుకు రావాలి

 మండలంలోని మోద్గులగూడెం జెడ్పీ హైస్కూల్‌లో గ్రామానికి చెందిన వేమిశెట్టి చంద్రయ్య–ప్రమీల దంపతులు సైకిళ్లను అందజేయగా.. కలెక్టర్‌ చేతుల మీదుగా 32మంది విద్యార్థినులకు ఆగ‌స్టు 16న‌ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దాతల దంపతులను కలెక్టర్‌ సన్మానించి మాట్లాడారు. మోద్గులగూడెం పాఠశాల సాధించిన విజయాలను అందరినోట వినడం ఆనందంగా ఉందని, టీచర్లను అభినందించారు.

చదవండి: Schools: ‘విద్యార్థులను ఇబ్బంది పెడితే ఉపేక్షించం’

చంద్రయ్య ముందుకొచ్చి చేస్తున్న సేవలు గొప్పవన్నారు. ఆయనను చూసి ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకోవడానికి మరింత మంది ముందుకు రావాలని కోరారు. పాఠశాలలో అభివృద్ధి పనులు చేపట్టాలన్నారు. ప్రహరీ నిర్మాణం వారం రోజుల్లో పూర్తిచేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ రాసాల కవిత, హెచ్‌ఎం బానోత్‌ శంకర్‌నాయక్‌, డీఈఓ రామారావు, ఆర్డీఓ అలివేలు, డీఆర్‌డీఓ సన్యాసయ్య, ఎస్‌ఎంసీ చైర్మన్‌ కుంట యాదగిరి, ఎంపీడీఓ సరస్వతీ, తహసీల్దార్‌ రఫీయొద్దీన్‌, దాతలు ఉప్పల వెంకటేశ్వర్లు, సైన్స్‌ టీచర్‌ అప్పారావు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

చదవండి: Collector Sumit Kumar: విద్యార్థుల డ్రా పౌట్ల వివరాలు సేకరించండి

Published date : 17 Aug 2023 05:17PM

Photo Stories