Schools: ‘విద్యార్థులను ఇబ్బంది పెడితే ఉపేక్షించం’
Sakshi Education
బెజ్జూర్(సిర్పూర్): విద్యార్థులను ఇబ్బంది పెడితే ఎంతటివారైనా ఉపేక్షించమని జిల్లా గిరిజన సంక్షేమశాఖ డిప్యూటీ డైరెక్టర్ రమాదేవి అన్నారు.
‘విద్యార్థులను ఇబ్బంది పెడితే ఉపేక్షించం’
బెజ్జూర్, సలుగుపల్లి, కుంటలమానెపల్లి పాఠశాలలను ఆగస్టు 16న ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బెజ్జూర్ ఆశ్రమ పాఠశాలలో వేధింపుల ఘటనలో హెచ్‌ఎంను సస్పెండ్ చేసినట్లు తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
జిల్లాలోని ఎనిమిది ఆశ్రమ పాఠశాలల్లో పురుష ఉపాధ్యాయులు, హెచ్‌డబ్ల్యూలు ఉన్నచోట మహిళా ఉపాధ్యాయులను నియమించినట్లు తెలిపారు. బెజ్జూర్ ఆశ్రమ పాఠశాలలోనే ఐదుగురు సీఆర్టీలను మార్చినట్లు పేర్కొన్నారు. పీఈటీలను నియమించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. జీసీడీఓ శకుంతల, ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయురాలు మారుబాయి ఉన్నారు.