Green School: 'హరిత'లో కుల్లూరు జెడ్పీకి విజయం.. ఢిల్లీలో పురస్కారం..!
కల్లూరు జెడ్పీ ఉన్నత పాఠశాలకు మరోసారి ‘హరిత’ వరించింది. జాతీయస్థాయిలో హరిత పాఠశాలగా మూడోసారి ఎంపికైంది. ఈ మేరకు ఈనెల 18న పాఠశాలలోని గ్రీన్ మాస్టర్ వెంకటసిద్ధులు, డివిజినల్ కన్వీనర్ రాజేంద్రతో పాటు ముగ్గురు విద్యార్థులకు అవార్డు అందుకోవడానికి ఆహ్వానం అందింది. పాఠశాలలో పచ్చదనం పెంపు, హరిత పాఠశాలగా తీర్చిదిద్దడానికి నేషనల్ గ్రీన్ కాప్స్‌లో ఉపాధ్యాయులు విద్యార్థులతో కలిసి విశేష కృషి చేశారు.
School Admissions: మరో విద్యాసంవత్సరానికి దరఖాస్తుల ఆహ్వానం..
పాఠశాలలో హరిత కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు ప్రజలను భాగస్వామ్యం చేస్తూ, ఎన్‌జీసీ విద్యార్థుల సహకారంతో వివిధ రకాల మొక్కలు నాటించి, వాటిని సంరక్షిస్తున్నారు. వర్షపు నీటిని నిల్వ చేసే మెరుగైన విధానాల అమలు, పాఠశాలలో గార్డెనింగ్ ఏర్పాటుకు ప్రత్యేక చొరవ చూపుతున్నారు. దీంతో 2018–19 సంవత్సరంలో కల్లూరు జెడ్పీ హైస్కూల్‌ను తొలిసారి జాతీయ స్థాయి పురస్కారం వరించింది. మళ్లీ 2019–20లో రెండవ సారి, ప్రస్తుతం 2023–24లో మూడోసారి ఈ అవార్డుకు పాఠశాల ఎంపిక కావడం విశేషం.
SMC Elections: ప్రభుత్వ పాఠశాలల్లో స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ ఎన్నికలు
జనవరి 30న ప్రదానం..
ఢిల్లీలోని ఇండియా హ్యాబిటేషన్ సెంటర్‌లో సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ డైరెక్టర్ జనరల్ సునీతా నరైన్ చేతుల మీదుగా అవార్డును ప్రదానం చేయనున్నారు.
Children Fitness:ఈ సర్వే ప్రకారం బడి విద్యార్థుల శారీరక ధృఢత్వం..! ఇవే కీలక విషయాలు..
జాతీయస్థాయి హరిత స్కూల్‌గా మూడోసారి ఎంపికైన కల్లూరు ప్రభుత్వ హైస్కూల్ హర్షం వ్యక్తం చేస్తున్న టీచర్లు, స్థానికులు 30న ఢిల్లీలో అవార్డు ప్రదానం
రాష్ట్రప్రభుత్వం విద్యారంగానికి పెద్దపీట వేస్తుండడంతో ప్రభుత్వ స్కూళ్లకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తోంది. స్కూళ్ల స్థితిగతులను మార్చడంతో విద్యార్థులు ఉన్నతంగా రాణిస్తున్నారు. అలాగే స్కూళ్లలో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని పెంపొందించడంలో ఉపాధ్యాయులు విద్యార్థులో కలిసి ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. కల్లూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలను మూడోసారి హరిత అవార్డు వరించింది. ముఖ్యంగా స్కూల్‌లో వర్షపునీటి నిల్వ, పచ్చదనం పెంపునకు మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణ చేపట్టడం, స్కూల్‌లో గార్డెనింగ్ ఏర్పాటు.. తదితర అంశాలను ప్రాతిపదికగా తీసుకుని కేంద్రం మూడోసారి అవార్డును ప్రదానం చేయనుంది.