School Admissions: మరో విద్యాసంవత్సరానికి దరఖాస్తుల ఆహ్వానం..
2024–25 విద్యాసంవత్సరానికి గాను జిల్లాలోని మైనార్టీ గురుకులాలు, కళాశాలల్లో ప్రవేశాలకు అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైందని జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి (డీఎండబ్ల్యూవో) రమేశ్ రాథోడ్ తెలిపారు. గురువారం, జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలోని ఆరు గురుకులాలు, ఆరు కళాశాలల్లో అడ్మిషన్లు స్వీకరిస్తున్నట్లు తెలిపారు.
Admissions: గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
గురుకులంలో ఐదోతరగతిలో పూర్తి సీట్లు, 6, 7, 8 తరగతుల్లో బ్యాక్‌లాగ్ ఖాళీలు, అలాగే కళాశాలలో ఇంటర్ ఫస్టియర్‌లో మొదటి సంవత్సరంలో అడ్మిషన్లు ఉన్నాయని పేర్కొన్నారు. అర్హత, ఆసక్తిగల విద్యార్థులు ఆన్‌లైన్, సంబంధిత గురుకులాలు, కళాశాలలకు నేరుగా వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. మైనార్టీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న గురుకులాల్లో కార్పొరేట్‌కు దీటుగా నాణ్యమైన విద్యతో పాటు భోజనం, వసతి కల్పించనున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలోని మైనార్టీ విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆయా గురుకులాలు, కళా శాలల ప్రిన్సిపాల్‌లు యూనుస్ సలీం, హిదాయతుల్లా హుస్సేన్, ఎండీ ఆసీఫ్, వెంకటప్రసాద్, వనిత, పల్లవి, తిరుపతి తదితరులున్నారు.
AP Anganwadi Workers : విధుల్లోకి చేరిన అంగన్‌వాడీ కార్యకర్తలు.. ఇంకా 1413 మంది..
ఉచిత శిక్షణ కోసం..
గ్రూప్ 1, 2, 3, 4 ఫౌండేషన్ కోర్సు ఉచిత శిక్షణకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా బీసీ అభివృద్ధి శాఖ అధికారి రాజలింగు, స్టడీ సర్కిల్ సెంటర్ డైరెక్టర్ ప్రవీణ్‌కుమార్ గురువారం ఓ సంయుక్త ప్రకటనలో తెలిపారు. ఈ నెల 20వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు.
Gurukula School Admissions: గురుకుల పాఠశాలలో దరఖాస్తులు
నాలుగు నెలల పాటు కొనసాగే శిక్షణ తరగతులను ఫిబ్రవరి 1 నుంచి ప్రారంభించనున్నట్లు తెలిపారు. అభ్యర్థుల ఎంపిక రిజర్వేషన్, డిగ్రీలో సాధించిన మార్కుల ఆధారంగా ఉంటుందని పేర్కొన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పూర్తి వివరాలకు 08732–221280 నంబర్‌లో సంప్రదించాలని జిల్లా బీసీ అభివృద్ధి శాఖ అధికారి రాజలింగు సూచించారు.