Navodaya Education : నవోదయలో అడ్మిషన్లకు వేళాయే.. 9,11 తరగతుల్లో ప్రవేశానికి దరఖాస్తులు..!
చిత్తూరు: ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని మదనపల్లెకు సమీపంలో ఉన్న వలసపల్లిలో 1986లో నెలకొల్పిన జవహర్ నవోదయ విద్యాలయం వేలాది మందిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్ది వారు ఎంచుకున్న రంగాల్లో స్థిర పడేందుకు దోహదపడింది. అక్కడ అడ్మిషన్‌కు వేళైంది.
తమ బిడ్డలు ఉన్నతంగా చదవాలి..వారి భవిత ఉజ్వలంగా ఉండాలి.. ఉన్నత శిఖరాలకు అధిరోహించాలన్నది తల్లిదండ్రుల కల. అలాంటి గ్రామీణ ప్రాంతాల్లోని మధ్యతరగతి తల్లిండ్రుల కలలు సాకారం చేయడానికి ఏర్పాటైనదే జవహర్ నవోదయ విద్యాలయం. పేదల ఆశలు నెరవేరుస్తోన్న జవహర్ నవోదయ విద్యాలయంలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. పల్లెల్లోని ప్రతిభావంతులకు ఇది సువర్ణ అవకాశం.
ISO Certificate : బాలికల గురుకులానికి ఐఎస్ఓ గుర్తింపు!
విద్యార్థులకు బోధనాంశాలివీ..
వలసపల్లె జవహర్ నవోదయ విద్యాలయంలో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేలా నైపుణ్యాలు, దేశభక్తి, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, చిత్రలేఖనం, ఎన్‌ఎస్‌ఎస్, ఎన్‌సీసీ వంటి శిక్షణలు ఇస్తున్నారు. ప్రతిష్టాత్మక ఐఐటీ, జేఈఈ, నీట్ , యూపీఎస్‌సీ, ట్రిపుల్ ఐటీ వంటి విద్యా సంస్థల్లో ప్రవేశాలు పొందేలా సన్నద్ధం చేస్తున్నారు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
మిగులు సీట్లకు దరఖాస్తుల ఆహ్వానం
2025–26 విద్యాసంవత్సరానికి సంబంధించి 9, 11వ తరగతుల్లో మిగులు సీట్ల భర్తీకి ప్రకటన వెలువడింది. రాత పరీక్ష ద్వారా ఖాళీలు భర్తీ చేయనున్నారు. 9,11వ తరగతుల్లో ప్రవేశానికి అర్హులైన విద్యార్థుల నుంచి ఆనన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. తొమ్మిదో తరగతిలో చేరేందుకు ప్రస్తుతం ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే విద్యార్థులు 2010 మే ఒకటి నుంచి 2012 జూలై 31 తేదీ మధ్య జన్మించి ఉండాలి. ఇంటర్‌లో చేరే విద్యార్థులు ప్రస్తుతం పదో తరగతి చదువుతూ 2008 జూన్ ఒకటి నుంచి 2010 జూలై 31వ తేదీ మధ్య జన్మించిన వారై ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకు చెందిన వారితోపాటు అన్ని కేటగిరీల విద్యార్థులకు ఈ నిబంధన వర్తిస్తుంది. విద్యార్థులు అక్టోబర్ 31లోగా నవోదయ విద్యాలయ వెబ్ సైట్ www. navodaya.gov.in ద్వారా దరఖాస్తు పూర్తి చేయాలి. అడ్మిషన్లు చేసుకునే విద్యార్థులకు 2025 ఫిబ్రవరి 8వ తేదీన చిత్తూరులో రాతపరీక్ష నిర్వహిస్తారు.
AP TET 2024 Key Released : ఏపీ టెట్ ఆన్సర్ కీ విడుదల.. ఒక్క క్లిక్‌తో ఇలా చెక్ చేసుకోండి
క్షేత్రస్థాయిలో అవగాహన కల్పిస్తున్నాం
వలసపల్లి నవోదయ విద్యాలయంలో వచ్చే విద్యాసంవత్సరం అడ్మిషన్ల అంశంపై క్షేత్రస్థాయిలో విద్యార్థులు వినియోగించుకునేలా అవగాహన కల్పిస్తున్నాం. ఈ నెల 31 వ తేదీ వరకు ఆసక్తి ఉన్న వారు అడ్మిషన్లు చేసుకోవచ్చు. వచ్చే ఏడాది కోసం 9, 11వ తరగతుల్లో మిగులు సీట్ల భర్తీ కోసం ప్రకటన విడుదల చేశారు. ప్రవేశాలు నియమ, నిబంధనల ప్రకారం నిర్వహిస్తారు. ప్రవేశాల కోసం దళారులను ఆశ్రయించొద్దు. ఎవరైనా సీటు ఇప్పిస్తామని మభ్య పెడితే ఫిర్యాదు చేయాలి. నవోదయలో విద్యనభ్యసించిన విద్యార్థులు ఉన్నత స్థానాల్లో ఉన్నారు. ఈ అవకాశాన్ని చిత్తూరు జిల్లా విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి.
– దేవరాజు, డీఈఓ, చిత్తూరు జిల్లా
☛ Join our WhatsApp Channel (Click Here)
☛ Join our Telegram Channel (Click Here)
9వ తరగతిలో ఎంపిక పరీక్ష ఇలా..
2025–26 విద్యాసంవత్సరానికిగాను ప్రవేశ పరీక్ష నిర్వహించి తొమ్మిదో తరగతిలో అడ్మిషన్లు కల్పించనున్నారు. ఇందుకు నోటిఫికేషన్ సైతం ఇటీవల విడుదల చేశారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోని ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు కలిగిన పాఠశాలల్లో చదివి ఉండాలని అధికారులు వెల్లడిస్తున్నారు. ప్రవేశ పరీక్షలో ప్రధానంగా హిందీ, ఇంగ్లిషు, గణితం, సైన్స్ సబ్జెక్ట్‌లోని ప్రశ్నలు ఉంటాయి. ఓఎంఆర్ ఆధారిత అబ్జెక్టివ్ రకం, ద్విభాషా ప్రశ్నపత్రం (హిందీ, ఆంగ్లం)లో ఉంటుంది.
ఇంటర్ 11వ తరగతిలో ప్రవేశానికి..
పదోతరగతి పూర్తి చేసి ఇంటర్ 11వ తరగతిలో చేరాలనుకునే విద్యార్థులు మానసిక సామర్థ్యం, ఇంగ్లిషు, గణితం, సైన్స్, సోషల్ సైన్స్‌లో ప్రావీణ్యం ఉండాలి. ఓఎంఆర్ ఆధారిత అబ్జెక్టివ్ రకం పేపర్ ఉంటుంది. ద్విభాషా ప్రశ్నపత్రం (హిందీ, ఆంగ్లం) ఉంటుంది. జిల్లాలోని ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో పదో తరగతి పూర్తి చేసి ఉండాలి.
Tags
- Navodaya Vidyalaya
- students education
- new academic year
- best and higher education
- entrance exams for navodaya admissions
- ninth and inter admissions at navodaya
- Admissions 2025
- Jawahar Navodaya Admissions 2025
- awareness on navodaya admissions
- Education News
- Sakshi Education News
- admissions in chitoor