Skip to main content

KGBV Admissions: కేజీబీవీల్లో బాలికల ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం.. ఇదే చివరి తేదీ..!

ఆరో తరగతి, ఇంటర్‌ మొదటి సంవత్సరంలో ప్రవేశానికి బాలికా విద్యార్థులకు ఆహ్వానం కల్పిస్తున్నట్లు ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో దరఖాస్తులు, అందుకు తేదీలు, తదితర వివరాలను వెల్లడించారు..
Admissions at KGBV Sattenapalli for Sixth Class and Inter Second Year Girl students

సత్తెనపల్లి: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఆలోచనల్లోంచి పుట్టినదే కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం (కేజీబీవీ). నేడు కేజీబీవీలు బాలికా విద్యకు సోపానాలుగా నిలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో 2024–25 విద్యా సంవత్సరంలో కేజీబీవీలో 6వ తరగతి, ఇంటర్‌ మీడియట్‌ ప్రథమ ఏడాదిలో ప్రవేశాలు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. వాటితో పాటు 7,8,9 తరగతుల్లో మిగులు సీట్లు కూడా భర్తీ చేసేందుకు నోటిఫికేషన్‌ ఇచ్చింది.

Tenth Class Public Exams 2024: పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి

ఈనెల 12 నుంచి ఏప్రిల్‌ 11 లోగా ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంది. కేజీబీవీలో చేరేందుకు అనాథలు, బడి బయట చిన్నారులు, బడి మధ్యలో మానేసిన బాలికలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, వలస కార్మికులు, తల్లిదండ్రుల్లో ఒకరే ఉన్న వారు, దారిద్రరేఖకు దిగువున ఉన్న బాలికలు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.20 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.1.40 లక్షలుగా ప్రభుత్వం నిర్ణయింది.

Study Material: టీచర్స్‌ రిక్రూట్‌మెంట్‌ అభ్యర్థులకు స్టడీ మెటీరియల్‌ దరఖాస్తులు

పల్నాడు జిల్లాలో 24 విద్యాలయాలు...

జిల్లాలో నరసరావుపేట, రొంపిచర్ల, సత్తెనపల్లి, ముప్పాళ్ల, రాజుపాలెం, నకరికల్లు, అచ్చంపేట, క్రోసూరు, బెల్లంకొండ, చిలకలూరిపేట, నాదెండ్ల, బొల్లాపల్లి, దాచేపల్లి, దుర్గి, ఈపూరు, మాచవరం, మాచర్ల, వెల్దుర్తి, పిడుగురాళ్ల, గురజాల, కారంపూడి, రెంటచింతల, వినుకొండ, నూజెండ్ల మండలాల్లో కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు ఉన్నాయి.

Election Notification: 2024 ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల‌.. ఏపీలో ఎన్నిక‌లు ఎప్పుడంటే..

భర్తీ చేయాల్సిన సీట్ల సంఖ్య...

ప్రతి కేజీబీవీలో 6వ తరగతిలో 40 సీట్లు, జూనియర్‌ ఇంటర్‌లో 40 సీట్లు చొప్పున మొత్తం 1920 సీట్ల భర్తీ చేసేందుకు ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది.

SEBI Recruitment 2024 : సెబీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల, వేతనం రూ. 90వేల వరకు..

ప్రవేశాలకు అవసరమైన పత్రాలు...

2024–25 సంవత్సరానికి దరఖాస్తులు ఆహ్వానం. 6వ తరగతి, ఫస్ట్‌ ఇంటర్‌కు అవకాశం ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరణ ప్రారంభం. జిల్లాలో 6వ తరగతికి 960 సీట్లు, ఇంటర్‌ ఫస్టీయర్‌కు 960 సీట్లు.

Students with 10 GPA: ఈ నెల 18 నుంచి పదో తరగతి పరీక్షలు.. విద్యార్థులంతా పది జీపీఏ సాధించడమే లక్ష్యంగా..!

కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయంలో చేరేందుకు బాలికలు దరఖాస్తు చేసుకునేందుకు బాలికతో పాటు తల్లిదండ్రుల ఆధార్‌ కార్డులు, రేషన్‌ కార్డు, కులం, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, విద్యార్హత సర్టిఫికెట్‌, ఒక పాస్‌పోర్ట్‌ ఫొటోతో పాటు ఫోన్‌ నెంబర్‌ ఉంటే apkgbv.apcfss.in వెబ్‌సైట్‌ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

Published date : 16 Mar 2024 04:56PM

Photo Stories