Admission in Tribal Gurukul Schools: 5వ తరగతి నుంచి 9 తరగతుల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
రేణిగుంట, కేవీపల్లి, గిరిజన గురుకుల రెసిడెన్షియల్ పాఠశాలల్లో 5వ తరగతి, 6 నుంచి 9 తరగతుల్లో మిగిలి ఉన్న ఖాళీలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఖాళీలను పరిశీలిస్తే రేణిగుంట స్కూల్లో ఐదో తరగతికి మొత్తం 80 సీట్లు ఉండగా, అందులో ఎస్టీ 59, ఎస్టీ (పీహెచ్‌సీ) –01, పీటీజీ–01, ఓసీ–02, ఎస్సీ–10, బీసీ–04, ఏఈక్యూ– 02 సీట్లు కేటాయించినట్లు ఆమె తెలిపారు. అలాగే 6వ తరగతిలో 39, 7వ తరగతిలో 08, 8వ తరగతిలో 03, 9వ తరగతిలో 12 సీట్లు ఖాళీలున్నట్లు వివరించారు. శ్రీకాళహస్తి బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో 5వ తరగతి ప్రవేశాలకు మొత్తం 80 సీట్లుండగా, వాటిలో ఎస్టీ 59, ఎస్టీ (పీహెచ్‌సీ) –01, పీటీజీ–01, ఓసీ–02, ఎస్సీ–10, బీసీ–04, ఏఈక్యూ– 02 సీట్లు కేటాయించినట్లు ఆమె తెలిపారు. 6వ తరగతి– 10, 7వ తరగతి– 00, 8వ తరగతి –00, 9వ తరగతి– 06 సీట్లు ఖాళీలున్నాయన్నారు. కేవీ పల్లి స్కూల్లో 5వ తరగతి ప్రవేశాలకు మొత్తం 80 సీట్లుండగా, వాటిలో ఎస్టీ 59, ఎస్టీ (పీహెచ్‌సీ) –01, పీటీజీ–01, ఓసీ–02, ఎస్సీ–10, బీసీ–04, ఏఈక్యూ– 02 సీట్లు కేటాయించినట్లు ఆమె తెలిపారు. అలాగే 6వ తరగతిలో 64, 7వ తరగతిలో 46, 8వ తరగతిలో 45, 9వ తరగతిలో 49 సీట్లు ఖాళీలున్నాయన్నారు. ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపిక ప్రక్రియ జరుగుతుందన్నారు. ఆసక్తి కలిగిన విద్యార్థులు ఆన్‌లైన్‌లో ఈనెల 15వ తేదీ నుంచి ఏప్రిల్ 10వ తేదీ వరకు దరఖాస్తులను www.aptwgurukulam.ap.gov.in వెబ్‌సైట్ నందు సమర్పించాలన్నారు. ఏప్రిల్ 21వ తేదీన ప్రవేశ పరీక్ష ఉంటుందని చెప్పారు. ఇతర వివరాలకు జిల్లా గిరిజన సంక్షేమాధికారి(94926 06731), రేణిగుంట స్కూల్ ప్రిన్సిపల్ (94410 40199), శ్రీకాళహస్తి ప్రిన్సిపల్(98666 62515), కెవి పల్లి ప్రిన్సిపల్ (94909 80563) నంబర్లను సంప్రదించాలని ఆమె కోరారు.