ITDA PO: సిలబస్ పూర్తి చేయకపోవడంపై పీవో ఆగ్రహం
Sakshi Education
రంపచోడవరం: సకాలంలో సిలబస్ పూర్తి చేయకపోవడంపై రంపచోడవరం ఐటీడీఏ పీవో సూరజ్ గనోరే ఉపాధ్యాయులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
మండలంలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలను బుధవారం సాయంత్రం ఆయన సందర్శించారు. దీనిలో భాగంగా ముందుగా ఊట్ల ఆశ్రమ పాఠశాలను సందర్శించి ఆయన విద్యార్థులతో మాట్లాడారు. ఈ ఏడాదికి సంబంధించి సిలబస్ పూర్తి చేయకపోవడంపై పీవో అగ్రహం వ్యక్తం చేశారు .ఎర్రంపాలెం ఆశ్రమ పాఠశాలలో కూడా ఇదే పరిస్థితి ఉండటంతో ఉపాధ్యాయుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులకు మెనూ ప్రకారం ఆహారం అందించాలని ఆదేశించారు. టెండరుదారులు ఆశ్రమ పాఠశాలలకు సకాలంలో కూరగాయలు, చికెన్ సరఫరా చేస్తున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు.స్టోర్ రూమ్‌ను తనిఖీ చేశారు. సిలబస్‌ను పూర్తి చేయడంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆయన వెంట డీడీ అబ్షలోం ఉన్నారు.
చదవండి: Intermediate: ఇంటర్‌లో ఆంగ్ల భాషా నైపుణ్యాలపై పరీక్ష
Published date : 15 Feb 2024 03:07PM