Academic Officer: విద్యార్థుల మార్కులను పరిశీలించిన మానిటరింగ్ అధికారి..
Sakshi Education
పదో తరగతి విద్యార్థులకు త్వరలో నిర్వహించనున్న బోర్డు పరీక్షలకు సిద్ధం చేయాలనే సూచననిస్తూ, విద్యార్థుల మార్కుల పరిశీలన జరిపారు మానిటరింగ్ అధికారి..
![Academic inspection by K. Ravikumar for tenth class assessments Preparation for upcoming board examinations emphasized by District Officer Inspection and Instructions for students marks by Monitoring officer](/sites/default/files/images/2024/02/06/students-marks-inspection-1707204260.jpg)
పదో తరగతి విద్యార్థులకు ఫార్మెటివ్ అసెస్‌మెంట్‌లో కేటాయించిన మార్కులను జిల్లా అకడమిక్ మానిటరింగ్ అధికారి కె.రవికుమార్ శనివారం తనిఖీ చేశారు. మండలంలోని చెరువుమాధారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించిన ఆయన విద్యార్థుల మార్కులను పరిశీలించి మాట్లాడారు.
Job for Handicapped: దివ్యాంగ యువకులకు ఉద్యోగావకాశం..! సద్వినియోగం చేసుకోంది..
వార్షిక పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణత నమోదయ్యేలా విద్యార్థులను సిద్ధం చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. జిల్లా పరీక్షల విభాగం కార్యదర్శి నారాయణతోపాటు రమేష్, రత్నకుమారి, సుంకరమౌని నాగార్జున, అరవింద్‌కుమార్, రత్నంరాజు, మంగేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
Published date : 05 Feb 2024 12:03PM