Job for Handicapped: దివ్యాంగ యువకులకు ఉద్యోగావకాశం..! సద్వినియోగం చేసుకోండి..

ఉమ్మడి జిల్లాలోని దివ్యాంగ నిరుద్యోగ యువతీ యువకుల కోసం ఈ నెల 7న ఉదయం 10.30 గంటలకు వివిధ కంపెనీల్లో ఉద్యోగాల కోసం ఉద్యోగమేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి ఎ.కళ్యాణి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగల యువతీ యువకులు ఆ రోజు బయోడేటా, విద్యార్హతల ఒరిజనల్ సర్టిఫికెట్లు, జిరాక్స్ ప్రతులు, ఆధార్‌కార్డుతో ఉపాధి కల్పన అధికారి కార్యాలయానికి చేరుకోవాలని కోరారు.
Jobs in Indian Air Force: అగ్నివీర్–వాయు నియామకాలకు నోటిఫికేషన్.. చివరి తేదీ ఇదే..
5న ఉద్యోగ మేళా
స్పందన స్ఫూర్తి ఫైనాన్షియల్ లిమిటెడ్ సంస్థలో క్రెడిట్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి ఈ నెల 5న ఉదయం 10.30 గంటలకు ఉద్యోగమేళా నిర్వహించనున్నట్లు ఉపాధి కల్పనాధికారి ఎ.కళ్యాణి ఓ ప్రకటనలో తెలిపారు. రూ.14 వేల వేతనం ఉంటుందని, అనంతపురం, శ్రీసత్యసాయి, అన్నమయ్య జిల్లాల పరిధిలో పని చేయాల్సి ఉంటుందన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు బయోడేటా, విద్యార్హత ధ్రువపత్రాలు ఒరిజినల్, జిరాక్స్, ఆధార్‌కార్డు తీసుకుని ఉద్యోగమేళాకు రావాలని కళ్యాణి కోరారు.