SK University Results 2023: డిగ్రీ మొదటి సెమిస్టర్ ఫలితాలు విడుదల
అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం పరిధిలో డిగ్రీ మొదటి సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ ఫలితాలను వీసీ మాచిరెడ్డి రామకృష్ణారెడ్డి బుధవారం విడుదల చేశారు. బీఎస్సీలో 57 శాతం, బీఏలో 35.71 శాతం, బీసీఏలో 66 శాతం, బీకాంలో 51 శాతం, బీబీఏలో 50 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. మొత్తం 7,964 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా, 4160 మంది ఉత్తీర్ణులయ్యారు. రీవాల్యుయేషన్, పర్సనల్ వెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 18న తుది గడువుగా నిర్ధేశించారు. ప్రతి పేపర్‌కు రూ.500 రుసుము చెల్లించాల్సి ఉంటుంది. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఎంవీ లక్ష్మయ్య, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ కె.శ్రీరాములు నాయక్, అసిస్టెంట్ కంట్రోలర్లు డాక్టర్ సీహెచ్ కృష్ణుడు, డాక్టర్ సి.అనూరాధ, డాక్టర్ డి.చంద్రమౌళి రెడ్డి, సీడీసీ డీన్ డాక్టర్ కె.రాంగోపాల్, అసిస్టెంట్ రిజిస్ట్రార్ డాక్టర్ ఎస్ . చండ్రాయుడు తదితరులు పాల్గొన్నారు. ఫలితాలు జ్ఞానభూమి పోర్టల్‌లో అందుబాటులో ఉంచారు.
AP EAPCET Counselling: ఫీజులపై క్లారిటీ వచ్చాకే ఇంజినీరింగ్ కౌన్సెలింగ్...?