Navodaya JNVST Result 2024: నవోదయ ఫలితాలు విడుదల
Sakshi Education
జవహర్ నవోదయ విద్యాలయంలో ఆరు, తొమ్మిదో తరగతుల్లో ప్రవేశాలకు నిర్వహించిన అర్హత పరీక్ష ఫలితాలను ప్రిన్సిపాల్ మంగతాయారు విడుదల చేశారు.
ప్రొవిజనల్ సెలెక్ట్ లిస్టు ద్వారా అర్హులైన 80 మంది విద్యార్థుల రూల్ నంబర్‌లను ప్రకటించారు. ఫలితాలు నవోదయ వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చని, ఎంపికై న విద్యార్థులు ఆధార్ కార్డు, హాల్‌టికెట్, దరఖాస్తు సమయంలో హెచ్‌ఎం సంతకంతో అప్‌లోడ్ చేసిన ఒరిజినల్ పత్రం తీసుకొని ఈ నెల 5లోగా విద్యాలయం నుంచి అడ్మిషన్ ఫాం పొందాలని సూచించారు.
తొమ్మిదో తరగతి ఫలితాలు
విద్యాలయంలో తొమ్మిదో తరగతిలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి గత ఫిబ్రవరిలో నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఫలితాలను కూడా ప్రిన్సిపాల్ విడుదల చేశారు. 319617, 320343, 319357, 320209, 320043 హాల్ టికెట్ నంబర్లు గల ఐదుగురు విద్యార్థులు తొమ్మిదో తరగతి ప్రవేశానికి ఎంపికయ్యారని తెలపారు. ఈ నెల 5లోగా హాల్‌టికెట్లు, ఆధార్ కార్డుతో హాజరై విద్యాలయంలో అడ్మిషన్ దరఖాస్తు తీసుకోవాలని సూచించారు.
Published date : 02 Apr 2024 01:48PM