Skip to main content

Results: మహిళా డిగ్రీ కళాశాల 1,3 సెమిస్టర్ల ఫలితాలు వెల్లడి

శ్రీకాకుళం న్యూకాలనీ: శ్రీకాకుళం ప్రభుత్వ మహిళా డిగ్రీ (అటానమస్‌) కళాశాలలో 2023–24 విద్యా సంవత్సరానికి చెందిన 1, 3 సెమిస్టర్‌ ఫలితాలు విడుదలయ్యాయి.
degree results    Srikakulam Government Women's Degree College  1st Semester Result 2023-24    3rd Semester Result 2023-24

ఈ ఫలితాలను కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కింతలి సూర్యచంద్రరావు విడుదల చేశారు. సకాలంలో ఫలితాలు విడుదల చేయడంలో కీలకంగా వ్యవహరించిన కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ను, సిబ్బందిని అభినందించారు. 1వ సెమిస్టర్‌లో బీఏ గ్రూపు విద్యార్థులు 53.33 శాతం, బీఎస్సీ గ్రూపు 84.49 శాతం, బీకాం (జనరల్‌) 63.56% శాతం ఉత్తీర్ణతను సాధించారు. మొత్తం మీద మొదటి సెమిస్టర్‌లో కళాశాల విద్యార్థులు 72.22 శాతం ఉత్తీర్ణతను సాధించారు. 3వ సెమిస్టర్‌లో బీఏ గ్రూపు విద్యార్థులు 23.88 శాతం, బీఎస్సీ గ్రూపు 56.20 శాతం, బీకాం (జెనరల్‌) 65.12శాతం, బీకాం (వొకేషనల్‌)76.92 శాతం ఉత్తీర్ణతను సాధించారు. మొత్తం మీద మూడో సెమిస్టర్‌లో కళాశాల విద్యార్థులు 54.52 శాతం ఉత్తీర్ణతను సాధించారని కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్‌ టి.ఆదిలక్ష్మి వెల్లడించారు.

చదవండి: Job interviews: నేడు, రేపు వర్సిటీలో ఉద్యోగ ఇంటర్వ్యూలు

Published date : 20 Feb 2024 03:46PM

Photo Stories