Results: బీటెక్ ఫలితాల విడుదల
అనంతపురం: జేఎన్‌టీయూ (ఏ) బీటెక్ నాలుగో సంవత్సర పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఒకటో సెమిస్టర్ (ఆర్–20 ) రెగ్యులర్, ఆర్–15, ఆర్–19 సప్లిమెంటరీ ఫలితాలు, నాలుగో సంవత్సరం రెండో సెమిస్టర్ (ఆర్–15) సప్లిమెంటరీ, ఒకటో సెమిస్టర్ (ఆర్–15) లాస్ట్‌ఛాన్స్ సప్లిమెంటరీ ఫలితాలు, ఎమ్మెస్సీ నాలుగో సెమిస్టర్ (ఆర్–21) సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను విడుదల చేసినట్లు డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్స్ ప్రొఫెసర్ ఈ. కేశవ రెడ్డి, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ బి. చంద్రమోహన్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. పరీక్ష ఫలితాల కోసం జేఎన్‌టీయూ అనంతపురం వెబ్‌సైట్ చూడాలని కోరారు.
రేపు ‘పురం’లో ఉద్యోగమేళా
హిందూపురం టౌన్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, స్థానిక ఎన్‌ఎస్‌పీఆర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల సంయుక్తంగా ఈ నెల 6న ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నాయి. ఎన్‌ఎస్‌పీఆర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో నిర్వహించే ఉద్యోగమేళాలో పలు కంపెనీలు పాల్గొంటున్నాయని కళాశాల ప్రిన్సిపాల్ ప్రగతి, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి అబ్దుల్ ఖయ్యూం తెలిపారు. పది, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ పూర్తిచేసి, 18 నుంచి 34 ఏళ్లలోపు వయసున్న నిరుద్యోగులు ఉద్యోగ మేళాకు అర్హులన్నారు. మేళాకు వచ్చే వారు బయోడేటాతో పాటు, ఆధార్ కార్డు, విద్యార్హతకు సంబంధించిన సర్టిఫికెట్లతో బుధవారం ఉదయం 9 గంటలకంతా ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో హాజరుకావాలని సూచించారు. ఉద్యోగాలకు ఎంపికై న వారు శ్రీ సత్యసాయి జిల్లా లేదా బెంగళూరులో పనిచేయాల్సి ఉంటుందన్నారు. పూర్తి వివరాలకు 9966682246 నంబరులో సంప్రదించాలని సూచించారు.