Skip to main content

JNTU Anantapur: ఎంసీఏ, ఎంబీఏ ఫలితాలు విడుదల

MCA, MBA results released

అనంతపురం: జేఎన్‌టీయూ (అనంతపురం) పరిధిలో ఆగస్టు, సెప్టెంబర్‌లో నిర్వహించిన ఎంసీఏ నాలుగో సెమిస్టర్‌ (ఆర్‌–21 ) రెగ్యులర్‌, ఎంసీఏ నాలుగు, ఐదో సెమిస్టర్‌ (ఆర్‌–17) సప్లిమెంటరీ ఫలితాలు, ఎంబీఏ నాలుగో సెమిస్టర్‌ (ఆర్‌–21) రెగ్యులర్‌, సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఈ మేరకు డైరెక్టర్‌ ఆఫ్‌ ఎవాల్యుయేషన్స్‌ ప్రొఫెసర్‌ ఇ.కేశవరెడ్డి, కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ ప్రొఫెసర్‌ బి.చంద్రమోహన్‌రెడ్డి శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పరీక్ష ఫలితాలను జేఎన్‌టీయూఏ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చన్నారు.

చదవండి: 

మొబైల్‌ వెటర్నరీ క్లినిక్‌లో ఉద్యోగాలు
అనంతపురం అగ్రికల్చర్‌: శ్రీసత్యసాయి జిల్లాలో వైఎస్సార్‌ మొబైల్‌ అంబులేటరీ క్లినిక్‌ డాక్టర్‌, డ్రైవర్‌ పోస్టులకు ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని 1962 హెల్ప్‌లైన్‌ జిల్లా కో ఆర్డినేటర్‌ రామకృష్ణగౌడ్‌ శుక్రవారం ఒక ప్రకటనలో సూచించారు. డాక్టర్‌ పోస్టుకు బీవీఎస్‌సీ లేదా ఎంవీఎస్‌సీ చేసి ఉండాలని తెలిపారు. నెలకు రూ.40వేల వేతనంతో పాటు పీఎఫ్‌, ఈఎస్‌ఐ సదుపాయం ఉంటుందని పేర్కొన్నారు. డ్రైవర్‌ పోస్టులకు పదో తరగతి పాసై ఉండాలని తెలిపారు. హెచ్‌ఎంవీ డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉండాలన్నారు. పీఎఫ్‌, ఈఎస్‌ఐ పోనూ నెలకు రూ.10,800 వస్తుందన్నారు. మరిన్ని వివరాలకు 96525 33554, 83740 77951 నంబర్లలో సంప్రదించాలని తెలిపారు.

జవాబుపత్రం ఫొటో తీసి కటకటాలపాలు
అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలోని పరీక్షల విభాగంలో మూల్యాంకనం చేయాల్సిన జవాబుపత్రాలను సెల్‌ఫోన్‌లో ఫొటో తీసి ఒక ఉద్యోగి కటకటాలపాలయ్యారు. పరీక్షల విభాగంలో వీర భద్రయ్య అనే వ్యక్తి డైలీవేజ్‌ కింద పని చేస్తున్నారు. ఇతను గురువారం జవాబుపత్రాలను తన సెల్‌ఫోన్‌తో ఫొటోలు తీస్తుండడంతో కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ శ్రీరాములునాయక్‌ గమనించారు. అతడివద్దకెళ్లి సెల్‌ఫోన్‌ లాక్కున్నారు. అయితే ఆ సమయంలో వీసీ అందుబాటులో లేరు. దీంతో శుక్రవారం ఉదయం అతడిని వీసీ మాచిరెడ్డి రామకృష్ణారెడ్డి బంగ్లా వద్దకు తీసుకెళ్లి హాజరుపరిచారు. ఫొటోలు ఎందుకు తీశావని అడిగితే, సరైన సమాధానం ఇవ్వలేదు. ఘటనపై ఇటుకలపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీరభద్రయ్యను పోలీసులు అరెస్ట్‌ చేసి విచారణ చేపట్టారు.

Published date : 23 Sep 2023 05:51PM

Photo Stories