Degree Results: డిగ్రీ నాలుగో సెమిస్టర్ మూల్యాంకనం పూర్తి.. త్వరలో ఫలితాలు విడుదల..
Sakshi Education
![Degree Results, University Examination Updates,Upcoming Release of Fourth Semester Results.](/sites/default/files/images/2023/10/19/results-1697697863.jpg)
ఎచ్చెర్ల క్యాంపస్: డిగ్రీ నాలుగో సెమిస్టర్ జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తి చేసినట్లు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం ఎగ్జామినేషన్స్ డీన్ డాక్టర్ ఎస్.ఉదయ్‌భాస్కర్ తెలిపారు. వర్సిటీ పరీక్షల కార్యాలయంలో ఆయన మంగళవారం వివరాలు వెల్లడించారు. త్వరలో ఈ ఫలితాలు విడుదల చేస్తామన్నారు. డిగ్రీ రెండో సెమిస్టర్ జవాబు పత్రాల మూల్యాంకనం చివరి దశకు చేరుకుందని తెలిపారు. నవంబర్ మొదటి వారంలో ఫలితాల విడుదలకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Published date : 19 Oct 2023 12:14PM