Skip to main content

SAIL Recruitment 2024: స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌లో 314 ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..

న్యూఢిల్లీలోని స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌(సెయిల్‌).. వివిధ విభాగాల్లో ఆపరేటర్‌-కమ్‌-టెక్నీషియన్‌(ట్రైనీ)-(ఓసీటీటీ) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Steel Authority of India Limited headquarters in New Delhi   Job vacancy announcement for Operator cum Technician Trainee positions  SAIL Recruitment 2024 Apply Online For 314 Operator Cum Technician Jobs

మొత్తం పోస్టుల సంఖ్య: 314
పోస్టుల వివరాలు: ఓసీటీటీ-మెటలర్జీ-57, ఓసీటీటీ-ఎలక్ట్రికల్‌-64, ఓసీటీటీ-మెకానికల్‌-100, ఓసీటీటీ-ఇన్‌స్ట్రుమెంటేషన్‌-17, ఓసీటీటీ-సివిల్‌-22, ఓసీటీటీ-కెమికల్‌-18, ఓసీటీటీ-సెరామిక్‌-06, ఓసీటీటీ-ఎలక్ట్రానిక్స్‌-08, ఓసీటీటీ-కంప్యూటర్‌/ఐటీ(మైన్స్‌లో మాత్రమే)-20, ఓసీటీటీ-డ్రాఫ్ట్స్‌మ్యాన్‌-2.
అర్హత: పదో తరగతి లేదా తత్సమాన ఉత్తీర్ణతతోపాటు మెటలర్జీ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్‌/ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్‌/ఇన్‌స్ట్రుమెంటేషన్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్, సివిల్, మెకానికల్, కెమికల్, సిరామిక్, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలికమ్యూనికేషన్, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, కంప్యూటర్‌ సైన్స్‌ విభాగాలకు సంబంధించి ఏదో ఒక దానిలో ఇంజనీరింగ్‌ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. ఓసీటీటీ-డ్రాఫ్ట్స్‌మ్యాన్‌ పోస్టుకు ఏడాదిపాటు డ్రాఫ్ట్స్‌మ్యాన్‌/డిజైన్‌గా పని అనుభవం ఉండాలి.
వయసు: 18 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: రాతపరీక్ష ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

పరీక్ష కేంద్రాలు: దేశంలోని ప్రధాన నగరాల్లో ఉంటుంది.

దరఖాస్తులకు చివరితేది: 18.03.2024.

వెబ్‌సైట్‌: https://www.sail.co.in/

చదవండి: Oil India Limited Recruitment 2024: ఆయిల్‌ ఇండియాలో సూపరింటెండింగ్‌ ఇంజనీర్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా‌..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

sakshi education whatsapp channel image link

Published date : 07 Mar 2024 12:50PM

Photo Stories