Skip to main content

AP Polycet Results 2022 : జూన్ 10న పాలిసెట్‌ ఫలితాలు విడుదల.. సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్‌లో ఫ‌లితాలు..

సాక్షి ఎడ్యుకేష‌న్‌: ఏపీ పాలిసెట్-2022 ఫ‌లితాల‌ను జూన్ 10వ తేదీన‌ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (SBTET) విడుదల చేయ‌నున్న‌ది.
AP Polycet Results 2022
AP Polycet Results

పాలిటెక్నిక్‌, డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు మే 29వ తేదీన‌ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పాలీసెట్‌ను నిర్వ‌హించిన విష‌యం తెల్సిందే. ఇప్ప‌టికే పాలిసెట్-2022 ఆన్సర్ కీని కూడా ఎస్‌బీటీఈటీ విడుద‌ల చేసింది. ఫ‌లితాల‌ను విడుద‌ల‌ చేసిన రోజే ర్యాంక్ కార్డ్ కూడా డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చ‌ని బోర్డ్ తెలిపింది. రిజిస్ట్రేషన్‌ వివరాలు, పుట్టిన తేదీని నమోదు చేసుకొని ఈ ఫ‌లితాల‌ను పొంద‌వ‌చ్చును.  ఈ ఫ‌లితాల‌ను సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్              ( www.sakshieducation.com )లో చూడొచ్చు. ఒకవేళ అర్హత మార్కుల‌లో ఎవరికైనా సమానంగా మార్కులు వచ్చినట్లయితే మ్యాథమాటిక్స్, ఫిజిక్స్‌, పుట్టిన తేదీల వారీగా సరిచూసి ర్యాంకును కేటాయిస్తారు. మొత్తం 120 మార్కులకు నిర్వహించే ఈ పరీక్షలో కనీసం 25 శాతం మార్కులు పొందిన వారికి ర్యాంకులు కేటాయిస్తామని బోర్డ్ తెలిపింది.  అభ్య‌ర్థులు త‌మ ర్యాంక్ కార్డును https://polycetap.nic.in/ లేదా http://sbtetap.gov.in/ వెబ్‌సైట్ల ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

Best Polytechnic Courses: పాలిటెక్నిక్‌తో.. గ్యారెంటీగా జాబ్ వ‌చ్చే కోర్సులు చేరాలనుకుంటున్నారా..? అయితే ఈ స‌మాచారం మీకోస‌మే..

TS POLYCET 2022: బహుళ అవకాశాల.. పాలిటెక్నిక్‌

రాష్ట్ర వ్యాప్తంగా 1,37,371 మంది విద్యార్థులు..
పాలీసెట్‌-2022 పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 404 పరీక్ష కేంద్రాలను, 52 సహాయ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ పరీక్షకు 1,37,371 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 1.25 లక్షల మంది విద్యార్థులు హాజరై పరీక్ష రాశారు. పరీక్ష పూర్తి అయిన కొద్ది రోజుల్లోనే ఈ ఫలితాలను విడుద‌ల‌ చేయ‌నున్నారు. పరీక్షలో వ‌చ్చిన‌ మార్కుల ఆధారంగానే ర్యాంక్‌ను కేటాయించడం జరుగుతుందని బోర్డ్ తెలిపింది.

Direct link for AP  Polycet results 2022

Published date : 08 Jun 2022 03:18PM

Photo Stories